Banner


    త్వమేవ శరణం త్వమేవ శరణం
    సంపుటి: 4, సంఖ్య: 33, పుట: 383 (395)
    సంపుటిలో రాగం: శ్రీరాగం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: త్వమేవ శరణం త్వమేవ శరణం
    కమలోదర శ్రీ జన్నాథా

    చ: వాసుదేవ కృష్ణ వామన నరసింహ
    శ్రీ సతీశ సరసిజనేత్రా
    భూసురవల్లభ పురుషోత్తమ పీత-
    కౌశేయవసన జగన్నాథా

    చ: బలభద్రానుజ పరమపురుష దుగ్ధ-
    జలధివిహార కుంజరవరద
    సులభ సుభద్రా సుముఖ సురేశ్వర
    కలిదోషహరణ జగన్నాథా

    చ: వటపత్ర శయన భువనపాలన జంతు-
    ఘటకార కరుణ శృంగారాధిప(?)
    పటుతర నిత్యవైభవరాయ తిరువేం-
    కటగిరినిలయ జగన్నాథా


    tvamEva SaraNam tvamEva SaraNam
    sampuTi: 4, samkhya: 33, puTa: 383 (395)
    sampuTilO rAgam: SrIrAgam
    rachana: tALlapAka annamAchArya


    pa: tvamEva SaraNam tvamEva SaraNam
    kamalOdara SrI jannAthA

    cha: vAsudEva kRShNa vAmana narasiMha
    SrI satISa sarasijanEtrA
    BUsuravallaBa puruShOttama pIta-
    kauSEyavasana jagannAthA

    cha: balaBadrAnuja paramapuruSha dugdha-
    jaladhivihAra kumjaravarada
    sulaBa suBadrA sumuKa surESvara
    kalidOShaharaNa jagannAthA

    cha: vaTapatra Sayana BuvanapAlana jamtu-
    GaTakAra karuNa SRmgArAdhipa(?)
    paTutara nityavaiBavarAya tiruvEm-
    kaTagirinilaya jagannAthA



    Artist(s): G Balakrishna Prasad, G Radha



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported