Banner


    శ్రీహరిసేసినచిహ్న లివి యీ
    సంపుటి: 1, సంఖ్య: 406, పుట: 272 (338)
    సంపుటిలో రాగం: పాడి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: శ్రీహరిసేసినచిహ్న లివి యీ-
    మోహము విడుచుట మోక్షమది

    చ: మలినం బేది మణుఁగననేది
    కలుషపుమలముల కాయ మిది
    కలిగిన దేది కడు లేందేది
    చలనపుమాయలజన్మ మిది

    చ: తనిసిన దేది తనియనిదేది
    దినదిన మాఁకలి దీరదిది
    కొన యిందేది గుఱి మొదలేది
    పనిగొనుకర్మపుబంధ మిది

    చ: నిండినదేది నిండనిదేది
    కొండలపొడవులకోరి కది
    అండనె శ్రీవేంకటాధిపు శరణని
    వుండుటె యిహపరయోగ మది


    SrIharisEsinacihna livi yI
    sampuTi: 1, samkhya: 406, puTa: 272 (338)
    sampuTilO rAgam: pADi
    rachana: tALlapAka annamAchArya


    pa: SrIharisEsinacihna livi yI-
    mOhamu viDucuTa mOkShamadi

    cha: malinam bEdi maNugananEdi
    kaluShapumalamula kAya midi
    kaligina dEdi kaDu lEmdEdi
    chalanapumAyalajanma midi

    cha: tanisina dEdi taniyanidEdi
    dinadina mAkali dIradidi
    kona yimdEdi gu~ri modalEdi
    panigonukarmapubamdha midi

    cha: nimDinadEdi nimDanidEdi
    komDalapoDavulakOri kadi
    amDane SrIvEmkaTAdhipu SaraNani
    vumDuTe yihaparayOga madi



    Artist(s): V Ananda Bhattar



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported