Banner


    రాజపు నీకెదురేది రామచంద్ర
    సంపుటి: 19, సంఖ్య: 165, పుట: 111 (131)
    సంపుటిలో రాగం: దేవగాంధారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: రాజపు నీకెదురేది రామచంద్ర
    రాజీవనయనుఁడ రామచంద్ర

    చ: వెట్టిగాదు నీవలపు వింటి నారికిఁ దెచ్చితివి
    ఱట్టుసేయఁ బనిలేదు యిట్టె రామచంద్ర
    గుట్టుతోడ జలనిధిపై గొండలు ముడివేసితి-
    వెట్టు మఱవఁగవచ్చు నివి రామచంద్ర

    చ: బతిమితోడుతఁ బైఁడిపతిమెఁ గైకొంటివి
    రతికెక్కె నీచలము రామచంద్ర
    మితిమీరి జవ్వనము మీఁదుకట్టితివి నాకై
    యితరు లేమనఁగల రిఁక రామచంద్ర

    చ: నావంటిసీతను నాఁగేటికొనఁ దెచ్చితి
    రావాడితమకముతో రామచంద్ర
    యీవేళ శ్రీవేంకటాద్రి నిరవై నన్నుఁ గూడితి
    చేవదేర గండికోట శ్రీరామచంద్ర


    rAjapu nIkedurEdi rAmachamdra
    sampuTi: 19, samkhya: 165, puTa: 111 (131)
    sampuTilO rAgam: dEvagAmdhAri
    rachana: tALlapAka annamAchArya


    pa: rAjapu nIkedurEdi rAmachamdra
    rAjIvanayanuDa rAmachamdra

    cha: veTTigAdu nIvalapu vimTi nAriki dechchitivi
    ~raTTusEya banilEdu yiTTe rAmachamdra
    guTTutODa jalanidhipai gomDalu muDivEsiti-
    veTTu ma~ravagavachchu nivi rAmachamdra

    cha: batimitODuta baiDipatime gaikomTivi
    ratikekke nIchalamu rAmachamdra
    mitimIri javvanamu mIdukaTTitivi nAkai
    yitaru lEmanagala rika rAmachamdra

    cha: nAvamTisItanu nAgETikona dechchiti
    rAvADitamakamutO rAmachamdra
    yIvELa SrIvEmkaTAdri niravai nannu gUDiti
    chEvadEra gamDikOTa SrIrAmachamdra



    Artist(s): T P Chakrapani



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported