Banner


    పుట్టినమొదలు నేను పుణ్యమేమీఁ గాననైతి
    సంపుటి: 3, సంఖ్య: 327, పుట: 221 (261)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: పుట్టినమొదలు నేను పుణ్యమేమీఁ గాననైతి
    యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా

    చ: కామినులఁ జూచి చూచి కన్నులఁ గొంతపాపము
    వేమరు నిందలు విని వీనులఁ గొంతపాపము
    నామువారఁ గల్లలాడి నాలికఁ గొంతపాపము
    గోమున బాపము మేనఁ గుప్పలాయ నివిగో

    చ: కానిచోట్లకు నేఁగి కాఁగిళ్ళఁ గొంతపాపము
    సేన దానా లందుకొని చేతులఁ గొంతపాపము
    మాననికోపమే పెంచి మతిఁ గొంతపాపము
    పూని పాపములే నాలోఁ బోగులాయ నివిగో

    చ: చేసినట్టివాఁడఁగాన చెప్ప నీకుఁ జోటులేదు
    దాసుఁడ నేనైతిఁ గొన దయదలఁచితివయ్య
    యీసరపులెల్లఁ జూచి యేమని నుతింతు నిన్ను
    ఆసల శ్రీవేంకటేశ ఆయఁబోయఁ బనులు


    puTTinamodalu nEnu puNyamEmI
    sampuTi: 3, samkhya: 327, puTa: 221 (261)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: puTTinamodalu nEnu puNyamEmI gAnanaiti
    yeTTu gAchEvayya nannu yimdirAnAthA

    cha: kAminula jUchi chUchi kannula gomtapApamu
    vEmaru nimdalu vini vInula gomtapApamu
    nAmuvAra gallalADi nAlika gomtapApamu
    gOmuna bApamu mEna guppalAya nivigO

    cha: kAnichOTlaku nEgi kAgiLLa gomtapApamu
    sEna dAnA lamdukoni chEtula gomtapApamu
    mAnanikOpamE pemchi mati gomtapApamu
    pUni pApamulE nAlO bOgulAya nivigO

    cha: chEsinaTTivADagAna cheppa nIku jOTulEdu
    dAsuDa nEnaiti gona dayadalachitivayya
    yIsarapulella jUchi yEmani nutimtu ninnu
    Asala SrIVEmkaTESa AyabOya banulu



    Artist(s): R Viswanath



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported