Banner


    ప్రేమముతో నిందరినిఁ బెండ్లాడితివి
    సంపుటి: 27, సంఖ్య: 104, పుట: 70 (112)
    సంపుటిలో రాగం: దేశాక్షి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ప్రేమముతో నిందరినిఁ బెండ్లాడితివి
    కామించి యేరీతి నేలి కరుణించేవయ్యా

    చ: కలికి కాఁగిటిలోనే కాఁపురము సేయఁగాను
    వెలఁదులకెల్లా నిఁక వేళ యేడది
    చలపట్టి యేపొద్దు సరసము లాడఁగాను
    మలసి ఇతరులకు మరి వేళ యేడది

    చ: చనవున నాపె మించి సారె మోవి యానఁగాను
    వెనకటిసతులకు వేళ యేడది
    కనుఁగొని యట్టె తనకతలే నీకుఁ జెప్పఁగా
    మనవి చెప్పేవారికి మరి వేళ యేడది

    చ: చెంత నీ శిరసుమీఁద సేస లాపె వెట్టఁగాను
    వింత సవతులకెల్లా వేళ యేడది
    ఇంతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
    మంతనపు చుట్టాలకు మరివేళ యేడది


    prEmamutO nimdarini bemDlADitivi
    sampuTi: 27, samkhya: 104, puTa: 70 (112)
    sampuTilO rAgam: dESAkShi
    rachana: tALlapAka annamAchArya


    pa: prEmamutO nimdarini bemDlADitivi
    kAmimchi yErIti nEli karuNimchEvayyA

    cha: kaliki kAgiTilOnE kApuramu sEyagAnu
    veladulakellA nika vELa yEDadi
    chalapaTTi yEpoddu sarasamu lADagAnu
    malasi itarulaku mari vELa yEDadi

    cha: chanavuna nApe mimchi sAre mOvi yAnagAnu
    venakaTisatulaku vELa yEDadi
    kanugoni yaTTe tanakatalE nIku jeppagA
    manavi cheppEvAriki mari vELa yEDadi

    cha: chemta nI SirasumIda sEsa lApe veTTagAnu
    vimta savatulakellA vELa yEDadi
    imtalO SrIVEmkaTESa yElitivi nannu nEDu
    mamtanapu chuTTAlaku marivELa yEDadi



    Artist(s): N C Sridevi



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported