Banner


    పొలిఁతి జవ్వనమునఁ బూవక
    సంపుటి: 24, సంఖ్య: 8, పుట: 6 (33)
    సంపుటిలో రాగం: మాళవి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: పొలిఁతి జవ్వనమునఁ బూవక పూచె
    యెలమి నిందుకు మనమేమి సేసేదే

    చ: సతి చింతాలతలలో సంపెఁగపూవులు పూచె
    మతివిరహపుమేన మల్లెలు పూచె
    అతనునితలపోఁత నడవిజాజులు పూచె
    హితవు తెలియ దిఁక నేమి సేసేదే

    చ: తొయ్యలిచెమటనీట దొంతిదామెరలు పూచె
    కొయ్యచూపుఁగోపములఁ గుంకుమ పూచె
    కయ్యపువలపులఁ జీఁకటిమాకులు పూచె
    నియ్యెడఁ చెలియభావ మేమి సేసేదె

    చ: మగువరతులలోన మంకెనపువ్వులు పూచె
    మొగిఁ గొనగోళ్ళనే మొగలి పూచె
    పొగరు శ్రీవేంకటేశుపొందులఁ గప్రము పూచె
    ఇగురుఁబోండ్ల మిఁక నేమి సేసేదే


    politi javvanamuna bUvaka
    sampuTi: 24, samkhya: 8, puTa: 6 (33)
    sampuTilO rAgam: mALavi
    rachana: tALlapAka annamAchArya


    pa: politi javvanamuna bUvaka pUche
    yelami nimduku manamEmi sEsEdE

    cha: sati chimtAlatalalO sampegapUvulu pUche
    mativirahapumEna mallelu pUche
    atanunitalapOta naDavijAjulu pUche
    hitavu teliya dika nEmi sEsEdE

    cha: toyyalichemaTanITa domtidAmeralu pUche
    koyyachUpugOpamula gumkuma pUche
    kayyapuvalapula jIkaTimAkulu pUche
    niyyeDa cheliyabhAva mEmi sEsEde

    cha: maguvaratulalOna mamkenapuvvulu pUche
    mogi gonagOLLanE mogali pUche
    pogaru SrIvEmkaTESupomdula gapramu pUche
    igurubOmDla mika nEmi sEsEdE



    Artist(s): Chinmaya Sisters



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported