Banner


    పొదలె నిండుఁగళలపున్నమ
    సంపుటి: 29, సంఖ్య: 434, పుట: 289 (313)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: పొదలె నిండుఁగళలపున్నమ నేఁడు
    అదను దప్పక జాజ రాడుదువు రావయ్యా

    చ: జలజాక్షిమోమునను చంద్రోదయమాయ
    నెలకొన్న నవ్వుల వెన్నెల గాసెను
    కలికి కన్నుల నల్లఁగలువలు వికసించె
    అలరి యీకెతో జాజ రాడుదువు రావయ్యా

    చ: యెనసి జవ్వనమున నేతెంచె వసంతకాల
    మొనరి మోవిఁ జిగురు లుప్పతిలెను
    గొనకొన్న తురుమునఁ గూడె తుమ్మిదమూఁక
    అనుమానించక జాజ రాడుదువు రావయ్యా

    చ: కుంకుమ చెమట చనుఁ గొప్పెరల నిండుకొనె
    కొంకక గోళ్లే బుఱ్ఱటకొమ్ము లాయెను
    లంకెలై శ్రీవేంకటేశ లలనతోఁ గూడితివి
    అంకెల నేపొద్దూ జాజ రాడుదువు రావయ్యా


    podale nimDugaLalapunnama
    sampuTi: 29, samkhya: 434, puTa: 289 (313)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: podale nimDugaLalapunnama nEDu
    adanu dappaka jAja rADuduvu rAvayyA

    cha: jalajAkshimOmunanu chamdrOdayamAya
    nelakonna navvula vennela gAsenu
    kaliki kannula nallagaluvalu vikasimche
    alari yIketO jAja rADuduvu rAvayyA

    cha: yenasi javvanamuna nEtenche vasantakAla
    monari mOvi jiguru luppatilenu
    gonakonna turumuna gUDe tummidamUka
    anumAninchaka jAja rADuduvu rAvayyA

    cha: kumkuma chemaTa chanu gopperala nimDukone
    konkaka gOLlE bu~r~raTakommu lAyenu
    lankelai SrIvEmkaTESa lalanatO gUDitivi
    ankela nEpoddU jAja rADuduvu rAvayyA



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported