Banner


    పరమాత్ముని నోరఁ బాడుచును
    సంపుటి: 1, సంఖ్య: 130, పుట: 89 (155)
    సంపుటిలో రాగం: కేదారగౌళ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: పరమాత్ముని నోరఁ బాడుచును యిరు-
    దరులు గూడఁగఁదోసి దంచీ మాయ

    చ: కొలఁదిబ్రహ్మాండపుకుందెనలోన
    కులికి జీవులనుకొలుచు నించి
    కలికిదుర్మోహపురోఁకలి వేసి
    తలఁచి తనవులను దంచీ మాయ

    చ: తొంగలిరెప్పలు రాత్రులుఁబగలును
    సంగడికనుఁగవ సరిఁదిప్పుచు
    చెంగలించి వెసఁ జేతులు విసరుచు
    దంగుడుబియ్యముగా దంచీ మాయ

    చ: అనయముఁ దిరువేంకటాధీశ్వరుని
    పనుపడి తనలోఁ బాడుచును
    వొనరి విన్నాణిజీవులనెడిబియ్యము
    తనర నాతనికియ్య దంచీ మాయ


    paramAtmuni nOra bADuchunu
    sampuTi: 1, samkhya: 130, puTa: 89 (155)
    sampuTilO rAgam: kEdAragauLa
    rachana: tALlapAka annamAchArya


    pa: paramAtmuni nOra bADuchunu yiru-
    darulu gUDagadOsi damchI mAya

    cha: koladibrahmAMDapukumdenalOna
    kuliki jIvulanukoluchu nimchi
    kalikidurmOhapurOkali vEsi
    talachi tanavulanu damchI mAya

    cha: tomgalireppalu rAtrulubagalunu
    samgaDikanugava saridippuchu
    chemgalimchi vesa jEtulu visaruchu
    damguDubiyyamugA damchI mAya

    cha: anayamu diruvEmkaTAdhISvaruni
    panupaDi tanalO bADuchunu
    vonari vinnANijIvulaneDibiyyamu
    tanara nAtanikiyya damchI mAya



    Artist(s): M Bala Murali Krishna



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported