Banner


    నీకే నే శరణు నీవు నన్నుఁ
    సంపుటి: 4, సంఖ్య: 194, పుట: 130 (142)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: నీకే నే శరణు నీవు నన్నుఁ గరుణించు
    యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నారిఁకను

    చ: కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు
    పన్నినలక్ష్మిభూమిపతివి నీవు
    అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యాదివేలుపవు
    యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను

    చ: దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి
    ఆవలఁ బాదాన లోక మణఁచితివి
    నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు
    యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను

    చ: అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి
    సిరుల వరములిచ్చేశ్రీవేంకటేశ
    పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు
    యిరవైననీవేకాక యెవ్వరున్నా రిఁకను


    nIkE nE SaraNu nIvu nannu
    sampuTi: 4, samkhya: 194, puTa: 130 (142)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: nIkE nE SaraNu nIvu nannu garuNimchu
    yIkaDa nAkaDa dikku yevvarunnArikanu

    cha: kannula jamdrasUryulugalavElupavu nIvu
    panninalakshmibhUmipativi nIvu
    anniTA brahmaku damDriyaina yAdivElupavu
    yennaga nIkamTE ghana mevvarunnA rikanu

    cha: dEvatalamdaru nI tirumEnainamUrti
    Avala bAdAna lOka maNachitivi
    nIvokkaDavE nilichina dEvuDavu
    yEvELa nIkamTE nekkuDevvarunnA rikanu

    cha: arasi jIvulakella namtaraatmavaina hari
    sirula varamulichchESrIvEmkaTESa
    purushOttamuDavu bhuvanarakshakuDavu
    yiravainanIvEkAka yevvarunnA rikanu



    Artist(s): V Ananda Bhattar



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported