Banner


    నీదాస్యమొక్కటే నిలిచి
    సంపుటి: 2, సంఖ్య: 20, పుట: 14 (86)
    సంపుటిలో రాగం: భైరవి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: నీదాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది
    శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము

    చ: అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా
    తనువిది మలమూత్రములప్రోగు
    జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా
    వొనరఁ గర్మమనేవోఁదానఁ బడినది

    చ: చదువుల శాస్త్రములజాడలు నమ్మితినా
    పొదలినమతములపోరాట మది
    మదిమదినుండిననామనసే నమ్మితినా
    అదియును నింద్రియాల కమ్ముడువోయినది

    చ: పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా
    పాత్రమగురుణానుబంధము లవి
    చిత్రముగ ననుఁ గావు శ్రీవేంకటేశ నీవే
    పత్రపుష్పమాత్రమే నా భక్తియెల్లా నీకు


    nIdAsyamokkaTE nilichi
    sampuTi: 2, samkhya: 20, puTa: 14 (86)
    sampuTilO rAgam: bhairavi
    rachana: tALlapAka annamAchArya


    pa: nIdAsyamokkaTE nilichi nammagaladi
    SrIdEvuDavu nIchittamu nAbhAgyamu

    cha: anushThaanamulu gatiyani nammi chEsitinaa
    tanuvidi malamUtramulaprOgu
    janulalO nuttamapujanmamE nammitinA
    vonara garmamanEvOdAna baDinadi

    cha: chaduvula SAstramulajADalu nammitinA
    podalinamatamulapOrATa madi
    madimadinumDinanAmanasE nammitinA
    adiyunu nimdriyAla kammuDuvOyinadi

    cha: putradAradhanadhAnyabhUmulu nammitinA
    pAtramaguruNAnubamdhamu lavi
    chitramuga nanu gaavu SrIvEmkaTESa nIvE
    patrapushpamAtramE nA bhaktiyellA nIku



    Artist(s): V Ananda Bhattar



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported