Banner


    నెలఁతసొబగు లివి నీ సొమ్ము
    సంపుటి: 12, సంఖ్య: 473, పుట: 271 (295)
    సంపుటిలో రాగం: శ్రీరాగం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: నెలఁతసొబగు లివి నీ సొమ్ము
    కలసి మెలసి యిటు గైకొనవయ్యా

    చ: వేమరు నవ్వులవెన్నెల గాసీ
    రామకడకు నిటు రావయ్యా
    దోమటిపలుకుల దొరిగీఁ దేనెలు
    ఆమనికాలము అవధరించవయ్యా

    చ: వలపులచెమటలవానలు గురిసీ
    సొలవక యీకెనుఁ జూడవయ్యా
    పెలుచుఁగుచంబుల పిందెలు వొడమెను
    అలరిన కానుక లందుకోవయ్యా

    చ: గములై మెయి మరుకళలు దొలఁకీ
    తమితోఁ గౌఁగిటఁ దగులవయ్యా
    జమళి శ్రీవేంకటేశ్వర సతిఁ గూడితి
    వమరె నీకు మే లవునయ్యా


    nelatasobagu livi nI sommu
    sampuTi: 12, samkhya: 473, puTa: 271 (295)
    sampuTilO rAgam: SrIrAgam
    rachana: tALlapAka annamAchArya


    pa: nelatasobagu livi nI sommu
    kalasi melasi yiTu gaikonavayyA

    cha: vEmaru navvulavennela gAsI
    rAmakaDaku niTu rAvayyA
    dOmaTipalukula dorigI dEnelu
    AmanikAlamu avadharimchavayyA

    cha: valapulachemaTalavAnalu gurisI
    solavaka yIkenu jUDavayyA
    peluchuguchambula pimdelu voDamenu
    alarina kAnuka lamdukOvayyA

    cha: gamulai meyi marukaLalu dolakI
    tamitO gaugiTa dagulavayyA
    jamaLi SrIvEmkaTESwara sati gUDiti
    vamare nIku mE lavunayyA



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported