Banner


    అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
    సంపుటి: 9, సంఖ్య: 299, పుట: 172 (186)
    సంపుటిలో రాగం: గౌళి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
    సింగారరాయఁడ నీకు శ్రీసతినిధానము

    చ: కమలాలపానుపు కాంతకు నీవురము
    ప్రమదపు నీమనసు పాలజలధి
    అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
    రమణీయ(ప్ర)హారాలు రత్నాలమేడలు

    చ: సతికి నీమెడ రతిసాము నేసేకంబము
    ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
    మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
    మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర

    చ: నెమ్మి నలమేల్‌మంగ నీ కాఁగిలి పెండ్లిపీఁట
    చిమ్ముల చందనచర్చ సేసపాలు
    వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
    పమ్మి శ్రీవేంకటేశ నీభావమే భోగము


    amganaku nIve akhilasAmrAjyamu
    sampuTi: 9, samkhya: 299, puTa: 172 (186)
    sampuTilO rAgam: gauLi
    rachana: tALlapAka annamAchArya


    pa: amganaku nIve akhilasAmrAjyamu
    simgArarAyaDa nIku SrIsatinidhAnamu

    cha: kamalAlapAnupu kAmtaku nIvuramu
    pramadapu nImanasu pAlajaladhi
    amaru nIbhujAmtara maTTe tIgepodarillu
    ramaNIya(pra)hArAlu ratnAlamEDalu

    cha: satiki nImeDa ratisAmu nEsEkambamu
    pratilEni vayyALi bayalu nIvu
    matimchina kaustubhamaNi niluvuTaddamu
    mitilEni SrIvatsamu mimchubamDArumudra

    cha: nemmi nalamEl^mamga nI kAgili pemDlipITa
    chimmula chamdanacharcha sEsapAlu
    vummaDi meDanULLu vuyyAlasarapaNulu
    pammi SrIvEmkaTESa nIbhAvamE bhOgamu



    Artist(s): Vani Jayaram



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported