Banner


    లలితలావణ్య విలాసముతోడ
    సంపుటి: 5, సంఖ్య: 130, పుట: 89 (163)
    సంపుటిలో రాగం: ఆహిరి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: లలితలావణ్య విలాసముతోడ
    నెలఁత ధన్యత గలిగె నేఁటితొడ

    చ: కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ
    తొప్పఁదోగేటి(గెడి?)చెమటతొడ
    అప్పుడటు శశిరేఖలైన చనుఁగవతోడ
    దెప్పిదేరేటి(రెడి?) మోముఁదమ్మితోడ

    చ: కులుకుఁ గబరీభరము కుంతలంబులతోడ
    తొలఁగఁ దోయని ప్రేమతోడ
    మొలకనవ్వులు దొలఁకు ముద్దుఁజూపులతోడ
    పులకలు పొడవైన పొలుపుతోడ

    చ: తిరువేంకటాచలాధిపుని మన్ననతోడ
    సరిలేని దివ్యవాసనలతోడ
    పరికించరాని అరవిరిభావముతోడ
    సిరి దొలఁ(లం?)కెడి చిన్నిసిగ్గుతోడ


    lalitalAvaNya vilAsamutODa
    sampuTi: 5, samkhya: 130, puTa: 89 (163)
    sampuTilO rAgam: Ahiri
    rachana: tALlapAka annamAchArya


    pa: lalitalAvaNya vilAsamutODa
    nelata dhanyata galige nETitoDa

    cha: kuppalugA mainasalukonna kastUritODa
    toppadOgETi(geDi?)chemaTatoDa
    appuDaTu SaSirEkhalaina chanugavatODa
    deppidErETi(reDi?) mOmudammitODa

    cha: kuluku gabarIbharamu kumtalambulatODa
    tolaga dOyani prEmatODa
    molakanavvulu dolaku muddujUpulatODa
    pulakalu poDavaina poluputODa

    cha: tiruvEmkaTAchalAdhipuni mannanatODa
    sarilEni divyavAsanalatODa
    parikincharaani araviribhAvamutODa
    siri dola(lam?)keDi chinnisiggutODa



    Artist(s): T P Chakrapani



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported