Banner


    అలరఁ జంచలమైనఆత్మలందుండ
    సంపుటి: 1, సంఖ్య: 67, పుట: 45 (111)
    సంపుటిలో రాగం: ఆహిరి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అలరఁ జంచలమైనఆత్మలందుండ నీ-
    యలవాటు సేసె నీవుయ్యాల
    పలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ నీ-
    భావంబు దెలిపె నీవుయ్యాల

    చ: ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైన-
    వుడుమండలము మోఁచె నుయ్యాల
    అదన నాకాశపద మడ్డదూలంబైన
    అఖిలంబు నిండె నీవుయ్యాల
    పదిలముగ వేదములు బంగారుచేరులై
    పట్టవెరపై తోఁచె నుయ్యాల
    వదలకిటు ధర్మదేవతపీఠమై మిగుల
    వర్ణింప నరుదాయ నుయ్యాల

    చ: మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల
    మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
    నీలశైలమువంటినీమేనికాంతికిని
    నిజమైనతొడవాయ నుయ్యాల
    పాలిండ్లు గదలఁగాఁ బయ్యదలు రాఁపాడ
    భామినులు వడినూఁచునుయ్యాల
    వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి-
    నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల

    చ: కమలకును భూసతికి కదలుకదలుకు మిమ్ముఁ
    గౌఁగిలింపఁగఁజేసె నుయ్యాల
    అమరాంగనలకు నీహావభావవిలాస
    మందంద చూపె నీవుయ్యాల
    కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై
    గణుతింప నరుదాయ నుయ్యాల
    కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు
    కడువేడుకై వుండె నుయ్యాల


    alara jamchalamainaAtmalamdumDa
    sampuTi: 1, samkhya: 67, puTa: 45 (111)
    sampuTilO rAgam: Ahiri
    rachana: tALlapAka annamAchArya


    pa: alara jamchalamainaAtmalamdumDa nI-
    yalavATu sEse nIvuyyAla
    palumAru nuchChvAsapavanamamdumDa nI-
    bhAvambu delipe nIvuyyAla

    cha: udayAsta Sailambu lonara gambhamulaina-
    vuDumamDalamu mOche nuyyAla
    adana nAkASapada maDDadUlambaina
    akhilambu nimDe nIvuyyAla
    padilamuga vEdamulu bamgAruchErulai
    paTTaverapai tOche nuyyAla
    vadalakiTu dharmadEvatapIThamai migula
    varNimpa narudAya nuyyAla

    cha: mElukaTlayi mIku mEghamamDalamella
    me~rugunaku me~rugAya nuyyAla
    nIlaSailamuvamTinImEnikAmtikini
    nijamainatoDavAya nuyyAla
    pAlimDlu gadalagA bayyadalu rApADa
    bhAminulu vaDinUchunuyyAla
    vOli brahmAmDamulu voragunOyani bhIti-
    noyyanoyyana vUchi ruyyAla

    cha: kamalakunu bhUsatiki kadalukadaluku mimmu
    gaugilimpagajEse nuyyAla
    amarAmganalaku nIhAvabhAvavilAsa
    mamdamda chUpe nIvuyyAla
    kamalAsanAdulaku gannulaku pamDugai
    gaNutimpa narudAya nuyyAla
    kamanIyamUrti vEmkaTaSailapati nIku
    kaDuvEDukai vumDe nuyyAla



    Artist(s): Nithya Santhoshini



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported