Banner


    ఇటు గరుడుని నీ వెక్కినను
    సంపుటి: 1, సంఖ్య: 92, పుట: 63 (129)
    సంపుటిలో రాగం: నాట
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : ఇటు గరుడుని నీ వెక్కినను
    పటపట దిక్కులు బగ్గనఁ బగిలె

    చ : ఎగసినగరుడుని యేపున ‘థా’యని
    జిగిదొలఁక చబుకుచేసినను
    నిగమాంతంబులు నిగమసంఘములు
    గగనము జగములు గడగడ వడఁకె

    చ : బిరుసుగ గరుడుని పేరెము దోలుచు
    బెరసి నీవు గోపించినను
    సరుస నఖిలములు జర్జరితములై
    తిరువున నలుగడ దిరదిరఁ దిరిగె

    చ : పలించిననీపసిఁడి గరుడనిని
    కెల్లున నీ వెక్కినయపుడు
    ఝల్లనె రాక్షససమితి నీమహిమ-
    వెల్లి మునుఁగుదురు వేంకటరమణా


    iTu garuDuni nI vekkinanu
    sampuTi: 1, samkhya: 92, puTa: 63 (129)
    sampuTilO rAgam: nATa
    rachana: tALlapAka annamAchArya


    pa : iTu garuDuni nI vekkinanu
    paTapaTa dikkulu baggana bagile

    cha : egasinagaruDuni yEpuna ‘thA’yani
    jigidolaka chabukuchEsinanu
    nigamAmtambulu nigamasamghamulu
    gaganamu jagamulu gaDagaDa vaDake

    cha : birusuga garuDuni pEremu dOluchu
    berasi nIvu gOpimchinanu
    sarusa nakhilamulu jarjaritamulai
    tiruvuna nalugaDa diradira dirige

    cha : palimchinanIpasiDi garuDanini
    kelluna nI vekkinayapuDu
    jhallane rAkShasasamiti nImahima-
    velli munuguduru vEMkaTaramaNA



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported