Banner


    అలమేలుమంగను నేనైతేనయితిఁగాక
    సంపుటి: 18, సంఖ్య: 31, పుట: 21 (41)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అలమేలుమంగను నేనైతేనయితిఁగాక
    నిలుచుండి నన్నుఁ జూచి నీకేల లోఁగను

    చ: చేరి విన్నవించవే సిగ్గువడ నీకేఁటికి
    చీరుమూరుగా వలచినదానవు
    వేరులే కప్పటనుండి వేళగాచుకుందానవు
    నేరుపుతో నన్నుఁ జూచి నీవేల లోఁగేవు

    చ: గట్టిగాను నవ్వవే కడుదాఁచనేఁటికి
    తొట్టినట్టితమకముతోడిదానవు
    నట్టున నందుకుఁగానే కోరి లాచి(జాచి ?) వుందానవు
    నెట్టన నేనుండఁగాను నీవేల లోఁగేవు

    చ: యెనసి కాఁగిలించవేఁ యేఁకరఁగ నీకేఁటికి
    పనివడి యట్టె యాసపడదానవు
    మునుపె నన్నుఁ గూడె నిమ్ముల శ్రీవేంకటేశుఁడు
    నిను నాతఁడే కూడి నీవేల లోఁగేవు


    alamElumamganu nEnaitEnayitigAka
    sampuTi: 18, samkhya: 31, puTa: 21 (41)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: alamElumamganu nEnaitEnayitigAka
    niluchumDi nannu jUchi nIkEla lOganu

    cha: chEri vinnavimchavE sigguvaDa nIkETiki
    chIrumUrugA valachinadAnavu
    vErulE kappaTanumDi vELagAchukumdAnavu
    nEruputO nannu jUchi nIvEla lOgEvu

    cha: gaTTigAnu navvavE kaDudAchanETiki
    toTTinaTTitamakamutODidAnavu
    naTTuna namdukugAnE kOri lAchi(jAchi ?) vumdAnavu
    neTTana nEnumDagAnu nIvEla lOgEvu

    cha: yenasi kAgilimchavE yEkaraga nIkETiki
    panivaDi yaTTe yAsapaDadAnavu
    munupe nannu gUDe nimmula SrIvEmkaTESuDu
    ninu nAtaDE kUDi nIvEla lOgEvu



    Artist(s): Vani Jayaram



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported