Banner


    అలమేలుమంగ యీకె ఆనుకవద్దనుండది
    సంపుటి: 8, సంఖ్య: 90, పుట: 54 (64)
    సంపుటిలో రాగం: శుద్ధవసంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అలమేలుమంగ యీకె ఆనుకవద్దనుండది
    చెలరేఁగి కందువలు చిత్తగించవయ్యా

    చ: తరుణిదేహమే నీకు తగుదివ్యరథము
    గరుడధ్వజంబాపె కప్పుపయ్యద
    తురగములు రతులఁ దోలెడు కోరికెలు
    సరినెక్కి వలపులు జయించవయ్యా

    చ: దిండు కలపిఱుఁదులు తేరు బండికండ్లు
    అండనే పువ్వులగుత్తులాపెచన్నులు
    కొండవంటి శృంగారము కోపునఁగల సొబగు
    నిండుకొని దిక్కులెల్లా నీవేగెలువవయ్యా

    చ: వెలఁదికంఠము నీకు విజయశంఖమదిగో
    నిలువెల్ల సాధనాలు నీకునాపె
    యెలమి శ్రీవేంకటేశ యిద్దరునుఁ గూడితిరి
    పలుజయముల నిట్టే పరగవయ్యా


    alamElumamga yIke AnukavaddanumDadi
    sampuTi: 8, samkhya: 90, puTa: 54 (64)
    sampuTilO rAgam: Suddhavasamtam
    rachana: tALlapAka annamAchArya


    pa: alamElumamga yIke AnukavaddanumDadi
    chelarEgi kamduvalu chittagimchavayyA

    cha: taruNidEhamE nIku tagudivyarathamu
    garuDadhwajambApe kappupayyada
    turagamulu ratula dOleDu kOrikelu
    sarinekki valapulu jayimchavayyA

    cha: dimDu kalapi~rudulu tEru bamDikamDlu
    amDanE puvvulaguttulApechannulu
    komDavamTi SRmgAramu kOpunagala sobagu
    nimDukoni dikkulellA nIvEgeluvavayyA

    cha: veladikamThamu nIku vijayaSamKamadigO
    niluvella sAdhanAlu nIkunApe
    yelami SrIvEmkaTESa yiddarunu gUDitiri
    palujayamula niTTE paragavayyA



    Artist(s): G Nageswara Naidu , K Jyothirmayi



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported