Banner


    ఇప్పు డిటు కలగంటి నెల్లలోకములకు
    సంపుటి: 1, సంఖ్య: 38, పుట: 25 (91)
    సంపుటిలో రాగం: భూపాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఇప్పు డిటు కలగంటి నెల్లలోకములకు-
    నప్పఁడగుతిరువేంకటాద్రీశుఁ గంటి-

    చ: అతిశయంబైనశేషాద్రిశిఖరము గంటి
    ప్రతిలేనిగోపురప్రభలు గంటి
    శతకోటిసూర్యతేజములు వెలుఁగఁగఁ గంటి
    చతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి

    చ: కనకరత్నకవాటకాంతు లిరుగడఁ గంటి
    ఘనమైనదీపసంఘములు గంటి
    అనుపమమణిమయమగుకిరీటము గంటి
    కనకాంబరము గంటి గక్కన మేలుకంటి

    చ: అరుదైనశంఖచక్రాదు లిరుగడఁ గంటి
    సరిలేని అభయహస్తము గంటిని
    తిరువేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటి
    హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి


    ippu DiTu kalagamTi nellalOkamulaku
    sampuTi: 1, samkhya: 38, puTa: 25 (91)
    sampuTilO rAgam: bhUpALam
    rachana: tALlapAka annamAchArya


    pa: ippu DiTu kalagamTi nellalOkamulaku-
    nappaDagutiruvEmkaTAdrISu gamTi-

    cha: atiSayambainaSEShAdriSikharamu gamTi
    pratilEnigOpuraprabhalu gamTi
    SatakOTisUryatEjamulu velugaga gamTi
    chaturAsyu boDagamTi chayyana mElukamTi

    cha: kanakaratnakavATakAmtu lirugaDa gamTi
    ghanamainadIpasamghamulu gamTi
    anupamamaNimayamagukirITamu gamTi
    kanakAmbaramu gamTi gakkana mElukamTi

    cha: arudainaSamkhachakrAdu lirugaDa gamTi
    sarilEni abhayahastamu gamTini
    tiruvEmkaTAchalAdhipuni jUDaga gamTi
    hari gamTi guru gamTi namtaTa mElukamTi



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported