Banner


    అలమేలుమంగ నీయభినవరూపము
    సంపుటి: 5, సంఖ్య: 160, పుట: 108 (182)
    సంపుటిలో రాగం: పాడి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అలమేలుమంగ నీయభినవరూపము
    జలజాక్షుకన్నులకు చవులిచ్చేవమ్మా

    చ: గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి
    పరమానందసంభరితవై
    నెరతనములు చూపి నిరంతరము నాథుని
    హరుషించఁగఁ జేసితి గదమ్మా

    చ: శశికిరణములకు చలువల చూపులు
    విశదముగా మీఁద వెదచల్లుచు
    రసికత పెంపునఁ గరఁగించి యెప్పుడు నీ-
    వశము చేసుకొంటి వల్లభునోయమ్మా

    చ: రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
    పట్టపురాణివై పరఁగుచు
    వట్టిమాఁకులిగిరించు వలపుమాటల విభు
    జట్టిగొని వురమున సతమైతివమ్మా


    alamElumamga nIyabhinavarUpamu
    sampuTi: 5, samkhya: 160, puTa: 108 (182)
    sampuTilO rAgam: pADi
    rachana: tALlapAka annamAchArya


    pa: alamElumamga nIyabhinavarUpamu
    jalajAkShukannulaku chavulichchEvammA

    cha: garuDAchalAdhISu ghana vakShamuna numDi
    paramAnamdasambharitavai
    neratanamulu chUpi niramtaramu nAthuni
    haruShimchaga jEsiti gadammA

    cha: SaSikiraNamulaku chaluvala chUpulu
    viSadamugA mIda vedachalluchu
    rasikata pempuna garagimchi yeppuDu nI-
    vaSamu chEsukomTi vallabhunOyammA

    cha: raTTaDi SrIvEmkaTarAyaniki nIvu
    paTTapurANivai paraguchu
    vaTTimAkuligirimchu valapumATala vibhu
    jaTTigoni vuramuna satamaitivammA



    Artist(s): Srirangam Gopalaratnam



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported