Banner


    అచ్చుత మిమ్ముఁదలఁచే
    సంపుటి: 3, సంఖ్య: 23, పుట: 16 (56)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అచ్చుత మిమ్ముఁదలఁచేయంతపని వలెనా
    యిచ్చల మీవారె మాకు నిహపరా లియ్యఁగా

    చ: మిమ్ము నెఱిఁగినయట్టిమీదాసుల నెఱిఁగే-
    సమ్మతివిఙ్ఞానమే చాలదా నాకు
    వుమ్మడి మీసేవసేసుకుండేటి వైష్ణవుల-
    సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు

    చ: నిరతి నీకుమొక్కేనీడింగరీలకు
    సరవితో మొక్కుటే చాలదా నాకు
    పరగ నిన్నుఁ బూజించేప్రపన్నులఁ బూజించే-
    సరిలేనిభాగ్యము చాలదా నాకు

    చ: అంది నీకు భక్తులైనయలమహానుభావుల-
    చందపువారిపై భక్తి చాలదా నాకు
    కందువ శ్రీవేంకటేశ కడు నీబంటుబంటుకు
    సందడిబంట నవుటే చాలదా నాకు


    achchuta mimmudalachE
    sampuTi: 3, samkhya: 23, puTa: 16 (56)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: achchuta mimmudalachEyamtapani valenA
    yichchala mIvAre mAku nihaparA liyyagA

    cha: mimmu ne~riginayaTTimIdAsula ne~rigE-
    sammativi~m~nAnamE chAladA nAku
    vummaDi mIsEvasEsukumDETi vaiShNavula-
    sammukhAna sEvimchuTE chAladA nAku

    cha: nirati nIkumokkEnIDimgarIlaku
    saravitO mokkuTE chAladA nAku
    paraga ninnu bUjimchEprapannula bUjimchE-
    sarilEnibhAgyamu chAladA nAku

    cha: amdi nIku bhaktulainayalamahAnubhAvula-
    chamdapuvAripai bhakti chAladA nAku
    kamduva SrIvEmkaTESa kaDu nIbamTubamTuku
    samdaDibamTa navuTE chAladA nAku



    Artist(s): N C Sridevi



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported