Banner


    ఆఁకటివేళల నలపైనవేళలను
    సంపుటి: 1, సంఖ్య: 158, పుట: 107 (173)
    సంపుటిలో రాగం: ముఖారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆఁకటివేళల నలపైనవేళలను
    తేఁకువ హరినామమే దిక్కు మఱి లేదు

    చ: కొఱమాలివున్న వేళ కులముచెడినవేళ
    చెఱవడి వొరులచేఁ జిక్కినవేళ
    వొఱపైనహరినామ మొక్కటే గతిగాక
    మఱచి తప్పిననైన మఱి లేదు తెఱఁగు

    చ: ఆపదవచ్చినవేళ యారడిఁబడినవేళ
    పాపపువేళల భయపడినవేళ
    వోపినంత హరినామ మొక్కటే గతిగాక
    మాపుదాఁకాఁ బొరలిన మరి లేదు తెఱఁగు

    చ: సంకెళఁబెట్టినవేళ చంపఁబిలిచినవేళ
    అంకిలిగా నప్పులవా రాఁగినవేళ
    వేంకటేశునామమే విడిపించ గతిగాక
    మంకుబుద్ధిఁ బొరలిన మరి లేదు తెఱఁగు


    AkaTivELala nalapainavELalanu
    sampuTi: 1, samkhya: 158, puTa: 107 (173)
    sampuTilO rAgam: mukhAri
    rachana: tALlapAka annamAchArya


    pa: AkaTivELala nalapainavELalanu
    tEkuva harinAmamE dikku ma~ri lEdu

    cha: ko~ramAlivunna vELa kulamucheDinavELa
    che~ravaDi vorulachE jikkinavELa
    vo~rapainaharinAma mokkaTE gatigAka
    ma~rachi tappinanaina ma~ri lEdu te~ragu

    cha: ApadavacchinavELa yAraDibaDinavELa
    pApapuvELala bhayapaDinavELa
    vOpinamta harinAma mokkaTE gatigAka
    mApudAkA boralina mari lEdu te~ragu

    cha: samkeLabeTTinavELa champabilichinavELa
    amkiligA nappulavA rAginavELa
    vEmkaTESunAmamE viDipimcha gatigAka
    mamkubuddhi boralina mari lEdu te~ragu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported