Banner


    ఇందరికి నభయంబు లిచ్చుఁజేయి
    సంపుటి: 1, సంఖ్య: 334, పుట: 223 (289)
    సంపుటిలో రాగం: సామంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : ఇందరికి నభయంబు లిచ్చుఁజేయి
    కందువగుమంచిబంగారుచేయి

    చ : వెలలేనివేదములు వెదకితెచ్చినచేయి
    చిలుకుగుబ్బలికిందఁ జేర్చుచేయి
    కలికియగుభూకాంతఁ గాఁ(గౌ ?)గిలించినచేయి
    వలనైనకొనగోళ్ళవాఁడిచేయి

    చ : తనివోక బలిచేత దానమడిగినచేయి
    వొనరంగ భూదానమొసఁగుచేయి
    మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చినచేయి
    యెనయ నాఁగేలు ధరియించుచేయి

    చ : పురసతులమానములు పొల్ల సేసినచేయి
    తురగంబుఁబరపెడి దొడ్డచేయి
    తిరువేంకటాచలాధీశుఁడై మోక్షంబు-
    తెరువు ప్రాణులకెల్లఁ దెలిపెడిచేయి


    iMdariki naBayaMbu liccujEyi
    sampuTi: 1, samkhya: 334, puTa: 223 (289)
    sampuTilO rAgam: sAmamtam
    rachana: tALlapAka annamAchArya


    pa : iMdariki naBayaMbu liccujEyi
    kaMduvagumaMcibaMgArucEyi

    ca : velalEnivEdamulu vedakiteccinacEyi
    cilukugubbalikiMda jErcucEyi
    kalikiyaguBUkAMta gA(gau ?)giliMcinacEyi
    valanainakonagOLLavADicEyi

    ca : tanivOka balicEta dAnamaDiginacEyi
    vonaraMga BUdAnamosagucEyi
    monasi jalanidhi yammu monaku deccinacEyi
    yenaya nAgElu dhariyiMcucEyi

    ca : purasatulamAnamulu polla sEsinacEyi
    turagaMbubarapeDi doDDacEyi
    tiruvEMkaTAcalAdhISuDai mOkShaMbu-
    teruvu prANulakella delipeDicEyi



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported