Banner


    అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు
    సంపుటి: 2, సంఖ్య: 112, పుట: 75 (147)
    సంపుటిలో రాగం: నాట
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు
    మహామహిమలను మలసీ వాఁడె

    చ: కదలుఁగన్నులును కరాళవదనము
    గుదిగొనుభయదపుఁగోరలును
    అదరుమీసములు నలరఁగ నవ్వుచు
    వుదుటుతోడఁ గొలువున్నాఁడు వాఁడె

    చ: అతిసితనఖములు ననంతభుజములు
    వితతపరాక్రమవేషమును
    అతులదీర్ఘ జిహ్వయుఁ గడు మెరయఁగ
    మితిలేనికరుణ మెరసీ వాఁడె

    చ: సందడిసొమ్ములు శంఖచక్రములు
    పొందుగ దివిజులు పొగడఁగను
    యిందిరఁ దొడపై నిడి శ్రీవేంకట-
    మందు నిందుఁ గడు నలరీ వాఁడే


    ahObalESwaru DarikuladamanuDu
    sampuTi: 2, samkhya: 112, puTa: 75 (147)
    sampuTilO rAgam: nATa
    rachana: tALlapAka annamAchArya


    pa: ahObalESwaru DarikuladamanuDu
    mahAmahimalanu malasI vADe

    cha: kadalugannulunu karALavadanamu
    gudigonubhayadapugOralunu
    adarumIsamulu nalaraga navvuchu
    vuduTutODa goluvunnADu vADe

    cha: atisitanakhamulu nanamtabhujamulu
    vitataparAkramavEShamunu
    atuladIrgha jihwayu gaDu merayaga
    mitilEnikaruNa merasI vADe

    cha: samdaDisommulu Samkhachakramulu
    pomduga divijulu pogaDaganu
    yimdira doDapai niDi SrIvEmkaTa-
    mamdu nimdu gaDu nalarI vADE



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported