Banner


    ఇదె శిరసు మాణిక్య మిచ్చి
    సంపుటి: 20, సంఖ్య: 229, పుట: 153 (189)
    సంపుటిలో రాగం: రామక్రియ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఇదె శిరసు మాణిక్య మిచ్చిపంపె నీకు నాకె
    అద నెఱిఁగి తెచ్చితి నవధరించవయ్యా

    చ: రామ నినుఁ బాసి నీరామ నేఁ జూడఁగ నా-
    రామమున నినుఁ బాడె రామరామ యనుచు
    ఆమెలుఁత సీతయని యపుడు నేఁ దెలిసి
    నీముద్రవుంగరము నే నిచ్చితిని

    చ: కమలాప్తకులుఁడ నీకమలాక్షి నీపాదఁ
    కమలములు దలపోసి కమలారి దూరె
    నెమకి యాలేమ నే నీదేవి యని తెలిసి
    అమరంగ నీసేమ మటు విన్నవించితి

    చ: దశరథాత్మజ నీవు దశశిరునిఁ జంపి యా-
    దశనున్నచెలిఁ గావు దశదిశలుఁ బొగడ
    రసికుఁడ శ్రీవేంకటరఘవీరుఁడ నీవు
    శశిముఖిఁ జేకొంటివి చక్కనాయఁ బనులు


    ide Sirasu mANikya michchi
    sampuTi: 20, samkhya: 229, puTa: 153 (189)
    sampuTilO rAgam: rAmakriya
    rachana: tALlapAka annamAchArya


    pa: ide Sirasu mANikya michchipampe nIku nAke
    ada ne~rigi techchiti navadharimchavayyA

    cha: rAma ninu bAsi nIrAma nE jUDaga nA-
    rAmamuna ninu bADe rAmarAma yanuchu
    Ameluta sItayani yapuDu nE delisi
    nImudravumgaramu nE nichchitini

    cha: kamalAptakuluDa nIkamalAkshi nIpAda
    kamalamulu dalapOsi kamalAri dUre
    nemaki yAlEma nE nIdEvi yani telisi
    amaramga nIsEma maTu vinnavimchiti

    cha: daSarathAtmaja nIvu daSaSiruni jampi yA-
    daSanunnacheli gAvu daSadiSalu bogaDa
    rasikuDa SrIvEmkaTaraghavIruDa nIvu
    SaSimukhi jEkomTivi chakkanAya banulu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported