Banner


    హీనాధికము లింక నేడ నున్నవో
    సంపుటి: 4, సంఖ్య: 43, పుట: 29 (41)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : హీనాధికము లింక నేడ నున్నవో కాని
    ఆనిన దాస్యము పొత్తు అందరికి నొకటే

    చ : నానావర్ణములవారు నరహరిఁ దలఁచేటి-
    ఆనామమంత్రజప మది యొకటే
    పూని యాతనిఁ గొలిచి భువి నేజాతైనాను
    మోనమునఁ బొందేటిమోక్షమూ నొకటే

    చ : వెనకకు ముందరికి విష్ణుకింకరులకెల్ల
    పనివడి కైకొనేటి భక్తియొక్కటే
    వునికి నాదేవుఁడు వొకఁడే అంతర్యామి
    మనెడి వైష్ణవకులమతమెల్లా నొకటే

    చ : భేదాభేదము లేదు పెక్కు మరఁగులు లేవు
    ఆదినంత్యములను ముక్తాత్మ లొక్కటే
    శ్రీదేవుఁ డైనట్టి శ్రీవేంకటేశ్వరుని-
    యాదరానఁ బొందు శరణాగతియు నొకటే


    hInAdhikamu limka nEDa nunnavO
    sampuTi: 4, samkhya: 43, puTa: 29 (41)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa : hInAdhikamu limka nEDa nunnavO kAni
    Anina dAsyamu pottu amdariki nokaTE

    cha : nAnAvarNamulavAru narahari dalachETi-
    AnAmamamtrajapa madi yokaTE
    pUni yAtani golichi bhuvi nEjAtainAnu
    mOnamuna bomdETimOkShamU nokaTE

    cha : venakaku mumdariki viShNukimkarulakella
    panivaDi kaikonETi bhaktiyokkaTE
    vuniki nAdEvuDu vokaDE amtaryAmi
    maneDi vaiShNavakulamatamellA nokaTE

    cha : bhEdAbhEdamu lEdu pekku maragulu lEvu
    Adinamtyamulanu muktAtma lokkaTE
    SrIdEvu DainaTTi SrIvEmkaTESwaruni-
    yAdarAna bomdu SaraNAgatiyu nokaTE



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported