Banner


    ఆహా నమో నమో ఆదిపురుష
    సంపుటి: 4, సంఖ్య: 97, పుట: 65 (77)
    సంపుటిలో రాగం: దేవగాంధారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆహా నమో నమో ఆదిపురుష నీకు
    యీహల నే నెంతవాఁడ నెట్టు గాచితివి

    చ: లోకాలోకములు లోననించుకొన్ననీవు
    యీకడ నాయాత్మలోన నెట్టణఁగితి
    ఆకడ వేదములకు నగోచరమైననీవు
    వాకుచే నీనామములు(ల?) వడి నెట్టణఁగితి

    చ: అన్నిటా బ్రహ్మాదులయజ్ఞభోక్తవైన నీవు
    అన్నపానములివి యెట్టారగించితి
    సన్నుతి పూర్ణుఁడవైజనియించిననీవు
    వున్నతి నాపుట్టుగులో వొకచో నెట్టుంటివి

    చ: దేవతలచే పూజ తివిరికొనిననీవు
    యీవల నాచే పూజ యెట్టు గొంటివి
    శ్రీవేంకటాద్రిమీఁద సిరితోఁగూడిననీవు
    యీవిధి నాయింట నీవు యెట్టు నిలిచితివి


    AhA namO namO AdipuruSha
    sampuTi: 4, samkhya: 97, puTa: 65 (77)
    sampuTilO rAgam: dEvagAmdhAri
    rachana: tALlapAka annamAchArya


    pa: AhA namO namO AdipuruSha nIku
    yIhala nE nemtavADa neTTu gAchitivi

    cha: lOkAlOkamulu lOnanimchukonnanIvu
    yIkaDa nAyAtmalOna neTTaNagiti
    AkaDa vEdamulaku nagOcharamainanIvu
    vAkuchE nInAmamulu(la?) vaDi neTTaNagiti

    cha: anniTA brahmAdulayaj~nabhOktavaina nIvu
    annapAnamulivi yeTTAragimchiti
    sannuti pUrNuDavaijaniyimchinanIvu
    vunnati nApuTTugulO vokachO neTTumTivi

    cha: dEvatalachE pUja tivirikoninanIvu
    yIvala nAchE pUja yeTTu gomTivi
    SrIvEmkaTAdrimIda siritOgUDinanIvu
    yIvidhi nAyimTa nIvu yeTTu nilichitivi



    Artist(s): N/A



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported