Banner


    ఆడుతాఁ బాడుతా నీతో నట్టె
    సంపుటి: 3, సంఖ్య: 390, పుట: 263 (303)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆడుతాఁ బాడుతా నీతో నట్టె ముద్దుగునుసుతా
    వోడక నీదండ చేరి వున్నారమయ్యా

    చ: ఆసఁ దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు
    యే సుఖదుఃఖములుఁ దా మెరఁగనట్టు
    వాసుల శ్రీపతి మిమ్ము వడి నాత్మఁ దలఁచుక
    యీసుల పుణ్యపాపము లెఱఁగమయ్యా

    చ: యేలినవారు వెట్టఁగా నేపునఁ దొత్తులు బంట్లు
    ఆలకించి పరులఁబోయడుగనట్టు
    తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించఁగా
    యేలని యేమియుఁ గోర నెరఁగమయ్యా

    చ: చేతఁ జిక్కి నిధానము చేరి యింటఁగలవాఁడు
    యేతులఁ గలిమిలేము లెరఁగనట్టు
    ఆతుమలో శ్రీవేంకటాధిప నీ వుండఁగాను
    యీతల నేవెలుతులు నెరఁగమయ్యా


    ADutA bADutA nItO naTTe
    sampuTi: 3, samkhya: 390, puTa: 263 (303)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: ADutA bADutA nItO naTTe muddugunusutA
    vODaka nIdamDa chEri vunnAramayyA

    cha: Asa dallidamDrimOmu aTTe chUchi SiSuvulu
    yE sukhadu@hkhamulu dA meraganaTTu
    vAsula SrIpati mimmu vaDi nAtma dalachuka
    yIsula puNyapApamu le~ragamayyA

    cha: yElinavAru veTTagA nEpuna dottulu bamTlu
    Alakimchi parulabOyaDuganaTTu
    tAlimi SrIpati mIru taga mammu rakShimchagA
    yElani yEmiyu gOra neragamayyA

    cha: chEta jikki nidhAnamu chEri yimTagalavADu
    yEtula galimilEmu leraganaTTu
    AtumalO SrIvEmkaTAdhipa nI vumDagAnu
    yItala nEvelutulu neragamayyA



    Artist(s): Shobha Raju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported