Banner


    గతులన్ని ఖిలమైన
    సంపుటి: 2, సంఖ్య: 372, పుట: 250 (322)
    సంపుటిలో రాగం: దేసాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : గతులన్ని ఖిలమైన కలియుగమందును
    గతి యీతఁడే చూపె ఘనగురుదైవము

    చ : యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-
    మీతనివల్లనే కంటి మీతిరుమణి
    యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
    మీతఁడే రామానుజులు యిహపరదైవము

    చ : వెలయించె నీతఁడేకా వేదపురహస్యములు
    చలిమి నీతఁడే చూపె శరణాగతి
    నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రాధారణము
    మలసి రామానుజులు మాటలాడేదైవము

    చ : నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు
    దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
    నయమై శ్రీవేంకటేశునగ మెక్కేవాకిటను
    దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రిదైవము


    gatulanni khilamaina
    sampuTi: 2, samkhya: 372, puTa: 250 (322)
    sampuTilO rAgam: dEsALam
    rachana: tALlapAka annamAchArya


    pa : gatulanni khilamaina kaliyugamamdunu
    gati yItaDE chUpe ghanagurudaivamu

    ca : yItanikaruNanEkA yila vaiShNavulamaiti-
    mItanivallanE kamTi mItirumaNi
    yItaDEkA vupadESa micche naShTAkSharimamtra-
    mItaDE rAmAnujulu yihaparadaivamu

    ca : velayimche nItaDEkA vEdapurahasyamulu
    calimi nItaDE chUpe SaraNAgati
    nilipinA DItaDEkA nijamudrAdhAraNamu
    malasi rAmAnujulu mATalADEdaivamu

    ca : niyamamu lItaDEkA nilipe brapannulaku
    dayatO mOkShamu chUpe daga nItaDE
    nayamai SrIvEMkaTESunaga mekkEvAkiTanu
    dayajUchI mammu niTTE tallitamDridaivamu



    Artist(s): G Balakrishna Prasad , G V N Anil



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported