Banner


    అడుగరే చెలులాల ఆతనినే
    సంపుటి: 19, సంఖ్య: 298, పుట: 199 (219)
    సంపుటిలో రాగం: దేశాక్షి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అడుగరే చెలులాల ఆతనినే యీమాట
    వుడివోనితమకాన నుండఁబోలు తాను

    చ: వేడుకగలప్పుడే వెస నవ్వు వచ్చుఁగాక
    వాడి వున్నప్పుడు తలవంపులే కావా
    యేడనో సతులచేత యేఁపులఁబడి రాఁబోలు
    యీడ నేఁ జెనకఁగాను యిటులా నుండునా

    చ: ఆసలఁ గూడినప్పుడే ఆయాలు గరఁగుఁగాక
    పాసివున్నప్పుడు తడఁబాటులేకావా
    బేసబెల్లివలపుల పిరివీకై రాఁబోలు
    సేస నేఁ బెట్టఁగాను సిగ్గువడి వుండునా

    చ: సరసమాడినప్పుడే చవులెల్లాఁ బుట్టుఁగాక
    గొరబై నయప్పుడు కొఱతలేకావా
    యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
    వరుస నిందాఁకా నిటువలెఁ జొక్కకుండునా


    aDugarE chelulAla AtaninE
    sampuTi: 19, samkhya: 298, puTa: 199 (219)
    sampuTilO rAgam: dESAkShi
    rachana: tALlapAka annamAchArya


    pa: aDugarE chelulAla AtaninE yImATa
    vuDivOnitamakAna numDabOlu tAnu

    cha: vEDukagalappuDE vesa navvu vachchugAka
    vADi vunnappuDu talavampulE kAvA
    yEDanO satulachEta yEpulabaDi rAbOlu
    yIDa nE jenakagAnu yiTulA numDunA

    cha: Asala gUDinappuDE AyAlu garagugAka
    pAsivunnappuDu taDabATulEkAvA
    bEsabellivalapula pirivIkai rAbOlu
    sEsa nE beTTagAnu sigguvaDi vumDunA

    cha: sarasamADinappuDE chavulellA buTTugAka
    gorabai nayappuDu ko~ratalEkAvA
    yiravai SrIvEmkaTESu DimtalOne nannu gUDe
    varusa nimdAkA niTuvale jokkakumDunA



    Artist(s): T P Chakrapani



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported