Banner


    గందము పూసేవేలే కమ్మని మేన
    సంపుటి: 5, సంఖ్య: 2, పుట: 2 (76)
    సంపుటిలో రాగం: భైరవి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : గందము పూసేవేలే కమ్మని మేన యీ-
    గందము నీమేనితావికంటె నెక్కుడా

    చ : అద్దము చూచేవేలే అప్పటప్పటికిని
    అద్దము నీ మోముకంటె నపురూపమా
    ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ-
    గద్దరికన్నులకంటె కమలము ఘనమా

    చ : బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా
    బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
    ఉంగరాలేఁటికినే వొడికపువేళ్ళ
    వెంగలిమణులు నీ వేలిగోరఁ బోలునా

    చ : సవర మేఁటికినే జడియు నీ నెరులకు
    సవరము నీకొప్పు సరివచ్చీనా
    యివలఁ జవులు నీకునేలే వేంకటపతి-
    సవరని కెమ్మోవిచవికంటేనా


    gamdamu pUsEvElE kammani mEna
    sampuTi: 5, samkhya: 2, puTa: 2 (76)
    sampuTilO rAgam: bhairavi
    rachana: tALlapAka annamAchArya


    pa : gamdamu pUsEvElE kammani mEna yI-
    gamdamu nImEnitAvikamTe nekkuDA

    cha : addamu chUchEvElE appaTappaTikini
    addamu nI mOmukamTe napurUpamA
    oddika tAmaravirinottEvu kannulu nI-
    gaddarikannulakamTe kamalamu ghanamA

    cha : bamgAru veTTEvElE paDati nI meyinimDA
    bamgAru nItanukAmti prativacchInA
    umgarAlETikinE voDikapuvELLa
    vemgalimaNulu nI vEligOra bOlunA

    cha : savara mETikinE jaDiyu nI nerulaku
    savaramu nIkoppu sarivacchInA
    yivala javulu nIkunElE vEmkaTapati-
    savarani kemmOvichavikamTEnA



    Artist(s): Vani Jayaram



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported