Banner


    ఎంతమాత్రమున నెవ్వరు దలఁచిన
    సంపుటి: 2, సంఖ్య: 393, పుట: 265 (337)
    సంపుటిలో రాగం: బౌళి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : ఎంతమాత్రమున నెవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు
    అంతరాంతరము లెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు

    చ : కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని
    పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు
    తలఁతురు మిము శైవులు తగినభక్తులును శివుఁ డనుఁచు
    అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁ డనుచు

    చ : సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీ వనుచు
    దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు
    సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పం బవుదువు
    గరిమల మిమునే ఘనమనితలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు

    చ : నీవలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁదితామెరవు
    ఆవల భాగీరథిదరిబావుల ఆజలమే వూరినయట్లు
    శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని
    యీవల నే నీశరణనియెదను యిదియే పరతత్వము నాకు


    eMtamAtramuna nevvaru dalacina
    sampuTi: 2, samkhya: 393, puTa: 265 (337)
    sampuTilO rAgam: bauLi
    rachana: tALlapAka annamAchArya


    pa : eMtamAtramuna nevvaru dalacina aMtamAtramE nIvu
    aMtarAMtaramu leMci cUDa biMDaMtE nippaTi yannaTlu

    ca : koluturu mimu vaiShNavulu kUrimitO viShNuDani
    palukuduru mimu vEdAMtulu parabrahmaM banucu
    talaturu mimu Saivulu taginaBaktulunu Sivu Danucu
    alari pogaDuduru kApAlikulu AdiBairavu Danucu

    ca : sari nennuduru SAktEyulu SaktirUpu nI vanucu
    dariSanamulu mimu nAnAvidhulanu talapula koladula BajiMturu
    sirula mimmunE yalpabuddhi dalacinavAriki nalpaM bavuduvu
    garimala mimunE Ganamanitalacina Ganabuddhulaku GanuDavu

    ca : nIvalana goratE lEdu mari nIrukoladitAmeravu
    Avala BAgIrathidaribAvula AjalamE vUrinayaTlu
    SrIvEMkaTapati nIvaitE mamu jEkonivunna daivamani
    yIvala nE nISaraNaniyedanu yidiyE paratatwamu nAku



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported