Banner


    అదివో కనుఁగొను మది యొకతె
    సంపుటి: 24, సంఖ్య: 68, పుట: 46 (73)
    సంపుటిలో రాగం: ముఖారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదివో కనుఁగొను మది యొకతె
    యెదుటనే నెలకొనె నిది యొకతె

    చ: తేటలమాటలఁ దెర లదె కట్టీఁ
    గాటుకకన్నులకలి కొకతె
    జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
    నీటుగర్వములనెలఁ తొకతె

    చ: ముసిముసినవ్వులు మోపులుగట్టీ
    రసికుఁడ నీపై రమణొకతె
    కొసరులఁ గుచములఁ గోటలు వెట్టీ
    మిసమిసమెఱుఁగుల మెలుఁ తొకతె

    చ: కాయజకేలికిఁ గందువ చెప్పీ
    చాయలసన్నల సతి యొకతె
    యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
    వోయని మెచ్చీ నొకతొకతె


    adivO kanugonu madi yokate
    sampuTi: 24, samkhya: 68, puTa: 46 (73)
    sampuTilO rAgam: mukhAri
    rachana: tALlapAka annamAchArya


    pa: adivO kanugonu madi yokate
    yeduTanE nelakone nidi yokate

    cha: tETalamATala dera lade kaTTI
    gATukakannulakali kokate
    jUTarichUpula jokkulu challI
    nITugarvamulanela tokate

    cha: musimusinavvulu mOpulugaTTI
    rasikuDa nIpai ramaNokate
    kosarula guchamula gOTalu veTTI
    misamisame~rugula melu tokate

    cha: kAyajakEliki gamduva cheppI
    chAyalasannala sati yokate
    yIyeDa SrIvEmkaTESa kUDi ninu
    vOyani mecchI nokatokate



    Artist(s): Nedunuri Krishnamurthy



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported