Banner


    అచ్చుతుశరణమే అన్నిటికిని గురి
    సంపుటి: 4, సంఖ్య: 3, పుట: 2 (14)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అచ్చుతుశరణమే అన్నిటికిని గురి
    హెచ్చుకుందు మరి యెంచఁగనేది

    చ: యోనిజనకమగు యొడ లిది
    యే నెల నైనా నేఁటి కులము
    తానును మలమూత్రపుఁ జెలమ
    నానాచారము నడచీనా

    చ: పాపపుణ్యముల బదుకిది
    యేపొద్దు మోక్షం బెటువలె దొరకు
    దీపనబాధల దినములివి
    చూపట్టి వెదకఁగ సుఖ మిందేది

    చ: మరిగినతెరువల మనసుయిది
    సరవినెన్న విజ్ఞానంబేది
    యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁడే
    వెరవని కంటే వెలితిఁక నేది


    achchutuSaraNamE anniTikini guri
    sampuTi: 4, samkhya: 3, puTa: 2 (14)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: achchutuSaraNamE anniTikini guri
    hechchukumdu mari yemchaganEdi

    cha: yOnijanakamagu yoDa lidi
    yE nela nainA nETi kulamu
    tAnunu malamUtrapu jelama
    nAnAchAramu naDachInA

    cha: pApapuNyamula badukidi
    yEpoddu mOkSham beTuvale doraku
    dIpanabAdhala dinamulivi
    chUpaTTi vedakaga sukha mimdEdi

    cha: mariginateruvala manasuyidi
    saravinenna vij~nAnambEdi
    yiravuga SrIvEmkaTESwaruDE
    veravani kamTE velitika nEdi



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported