Banner


    అదివో చూడరో అందరు మొక్కరో
    సంపుటి: 2, సంఖ్య: 498, పుట: 337 (409)
    సంపుటిలో రాగం: పాడి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదివో చూడరో అందరు మొక్కరో
    గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని

    చ: రవిమండలమున రంజిల్లు తేజము
    దివిఁ జంద్రునిలోతేజము
    భువి ననలంబునఁబొడమినతేజము
    వివిధంబులైనవిశ్వతేజము

    చ: క్షీరాంబుధిలోఁ జెలఁగుసాకారము
    సారె వైకుంఠపుసాకారము
    యీరీతి యోగీంద్రులెంచుసాకారము
    సారెకు జగములసాకారము

    చ: పొలసినయాగంబులలో ఫలమును
    పలుతపములలో ఫలమును
    తలఁచినతలఁపుల దానఫలంబును
    బలిమి శ్రీవేంకటపతియే ఫలము


    adivO chUDarO amdaru mokkarO
    sampuTi: 2, samkhya: 498, puTa: 337 (409)
    sampuTilO rAgam: pADi
    rachana: tALlapAka annamAchArya


    pa: adivO chUDarO amdaru mokkarO
    gudigone brahmamu kOnETidarini

    cha: ravimamDalamuna ramjillu tEjamu
    divi jamdrunilOtEjamu
    bhuvi nanalambunaboDaminatEjamu
    vividhambulainaviSwatEjamu

    cha: kShIrAmbudhilO jelagusAkAramu
    sAre vaikumThapusAkAramu
    yIrIti yOgImdrulemchusAkAramu
    sAreku jagamulasAkAramu

    cha: polasinayAgambulalO phalamunu
    palutapamulalO phalamunu
    talachinatalapula dAnaphalambunu
    balimi SrIvEmkaTapatiyE phalamu



    Artist(s): Shobha Raju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported