Banner


    అదివో అల్లదివో హరివాసము
    సంపుటి: 1, సంఖ్య: 23, పుట: 15 (81)
    సంపుటిలో రాగం: శ్రీరాగం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదివో అల్లదివో హరివాసము
    పదివేలు శేషులపడగలమయము

    చ: అదె వేంకటాచల మఖిలవున్నతము
    అదివో బ్రహ్మాదుల కపురూపము
    అదివో నిత్యనివాస మఖిలమునులకు
    నదె చూడుఁ డదె మొక్కుఁ డానందమయము

    చ: చెంగట నల్లదివో శేషాచలము
    నింగినున్న దేవతలనిజవాసము
    ముంగిట నల్లదివో మూలనున్నధనము
    బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము

    చ: కైవల్యపదము వేంకటనగ మదివో
    శ్రీవేంకటపతికి సిరులైనవి
    భావింప సకలసంపదరూప మదివో
    పావనములకెల్లఁ బావనమయము


    adivO alladivO harivAsamu
    sampuTi: 1, samkhya: 23, puTa: 15 (81)
    sampuTilO rAgam: SrIrAgam
    rachana: tALlapAka annamAchArya


    pa: adivO alladivO harivAsamu
    padivElu SEShulapaDagalamayamu

    cha: ade vEmkaTAchala makhilavunnatamu
    adivO brahmAdula kapurUpamu
    adivO nityanivAsa makhilamunulaku
    nade chUDu Dade mokku DAnamdamayamu

    cha: chemgaTa nalladivO SEShAchalamu
    nimginunna dEvatalanijavAsamu
    mumgiTa nalladivO mUlanunnadhanamu
    bamgAruSikharAla bahubrahmamayamu

    cha: kaivalyapadamu vEmkaTanaga madivO
    SrIvEmkaTapatiki sirulainavi
    bhAvimpa sakalasampadarUpa madivO
    pAvanamulakella bAvanamayamu



    Artist(s): Shobha Raju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported