Banner


    ఏపురాణముల నెంత వెదకినా
    సంపుటి: 2, సంఖ్య: 88, పుట: 59 (131)
    సంపుటిలో రాగం: గుండక్రియ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : ఏపురాణముల నెంత వెదకినా
    శ్రీపతిదాసులు చెడ రెన్నఁడును

    చ : హరివిరహితములు అవి గొన్నాళ్లకు
    విరసంబులు మరి విఫలములు
    నరహరిఁ గొలి చిటు నమ్మినవరములు
    నిరతము లెన్నఁడు నెలవులు చెడవు

    చ : కమలాక్షుని మతిఁగాననిచదువులు
    కుమతంబులు బహుకుపథములు
    జమళి నచ్యుతునిసమారాధనలు
    విమలములే కాని వితథముగావు

    చ : శ్రీవల్లభుగతిఁ జేరనిపదవులు
    దావతులు కపటధర్మములు
    శ్రీవేంకటపతి సేవించు సేవలు
    పావనము లధికభాగ్యపుసిరులు


    EpurANamula nemta vedakinA
    sampuTi: 2, samkhya: 88, puTa: 59 (131)
    sampuTilO rAgam: gumDakriya
    rachana: tALlapAka annamAchArya


    pa : EpurANamula nemta vedakinA
    SrIpatidAsulu cheDa rennaDunu

    cha : harivirahitamulu avi gonnALlaku
    virasambulu mari viphalamulu
    narahari goli chiTu namminavaramulu
    niratamu lennaDu nelavulu cheDavu

    cha : kamalAkShuni matigAnanichaduvulu
    kumatambulu bahukupathamulu
    jamaLi nachyutunisamArAdhanalu
    vimalamulE kAni vitathamugAvu

    cha : SrIvallabhugati jEranipadavulu
    dAvatulu kapaTadharmamulu
    SrIvEMkaTapati sEvimchu sEvalu
    pAvanamu ladhikabhAgyapusirulu



    Artist(s): M Rajeswari



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported