Banner


    ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
    సంపుటి: 3, సంఖ్య: 193, పుట: 129 (169)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
    ఆదిగొని భూభార మణఁచీనోయమ్మా

    చ: చందురునుదయవేళ సవ రేతిరి కాడ
    కందువ దేవకి బిడ్డఁ గనెనమ్మా
    పొందుగ బ్రహ్మాదులు పురుఁటింటివాకిటను
    చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా

    చ: వసుదేవునియెదుట వైకుంఠనాథుఁడు
    శిశువై యవతరించి చెలఁగీ నమ్మా
    ముసిముసినవ్వులతో మునులకు ఋషులకు
    యిసుమంతవాఁ డభయమిచ్చీనమ్మా

    చ: కన్నతల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
    అన్నిటా రాకాసిమూఁక లణఁచీనమ్మా
    వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ
    పన్ని నిచ్చకల్యాణాలఁ బరగీనమ్మా


    AdiviShNu vItaDE yaTarammA
    sampuTi: 3, samkhya: 193, puTa: 129 (169)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: AdiviShNu vItaDE yaTarammA
    Adigoni bhUbhAra maNachInOyammA

    cha: chamdurunudayavELa sava rEtiri kADa
    kamduva dEvaki biDDa ganenammA
    pomduga brahmAdulu puruTimTivAkiTanu
    chemdi bAluni nutulu sEsErOyammA

    cha: vasudEvuniyeduTa vaikumThanAthuDu
    SiSuvai yavatarimchi chelagI nammA
    musimusinavvulatO munulaku RShulaku
    yisumamtavA DabhayamicchInammA

    cha: kannatallidamDrulaku karmapASamu lUDichi
    anniTA rAkAsimUka laNachInammA
    vunnati SrIvEmkaTAdrinumDi lakShmIdEvitODa
    panni nichchakalyANAla baragInammA



    Artist(s): Priya Sisters



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported