Banner


    దినము ద్వాదశి నేఁడు
    సంపుటి: 2, సంఖ్య: 151, పుట: 101 (173)
    సంపుటిలో రాగం: శ్రీరాగం
    రచన: తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య


    ప : దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు
    జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే

    చ : అనంతగరుడముఖ్యులైనసూరిజనులతో
    ఘననారదాదిభాగవతులతో
    దనుజమర్ధనుఁడైన దైవశిఖామణితోడ
    వెనుకొని యారగించ విచ్చేయవే

    చ : వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
    లోకపునిత్యముక్తులలోన నుండి
    శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశుఁ గూడి
    యీకడ నారగించ నింటికి విచ్చేయవే

    చ : సంకీర్తనముతోడ సనకాదులెల్లఁ బాడ
    పొంకపుశ్రీవేంకటాద్రిభూమి నుండి
    లంకె శ్రీవేంకటగిరిలక్ష్మీవిభుఁడు నీవు-
    నంకెల మాయింటివిందు లారగించవే


    dinamu dwAdaSi nEDu
    sampuTi: 2, samkhya: 151, puTa: 101 (173)
    sampuTilO rAgam: SrIrAgam
    rachana: tALlapAka pedda tirumalAchArya


    pa : dinamu dwAdaSi nEDu tIrthadivasamu nIku
    janakuDa annamAchAryuDa vicchEyavE

    ca : anamtagaruDamukhyulainasUrijanulatO
    ghananAradAdibhAgavatulatO
    danujamardhanuDaina daivaSikhAmaNitODa
    venukoni yAragimcha vicchEyavE

    ca : vaikumThAna numDi yALuvAralalOpala numDi
    lOkapunityamuktulalOna numDi
    SrIkAmtatODa nunna SrIvEMkaTESu gUDi
    yIkaDa nAragimcha nimTiki vicchEyavE

    ca : samkIrtanamutODa sanakAdulella bADa
    pomkapuSrIvEMkaTAdribhUmi numDi
    lamke SrIvEmkaTagirilakShmIvibhuDu nIvu-
    namkela mAyimTivimdu lAragimchavE



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported