Banner


    అదె వచ్చె చెలియ యొయారమ్ముతో
    సంపుటి: 26, సంఖ్య: 1, పుట: 5 (13)
    సంపుటిలో రాగం: (తాళపత్రంలో పేరులేదు)
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదె వచ్చె చెలియ యొయారమ్ముతో ప్రియుని
    సదనంబు వెడలి తన సఖులు గనకుండా

    చ: నుదుటి కస్తురి చెమట పదనై జారుచీర
    నదిమి వీడిన తురుము కుదురుపరచి
    వొదిగొదిగి తనకెవ్వరెదురౌదురో యంటా
    పెదవిగంటీ మడుపు తుద మాటుకొంటా

    చ: నునుగుబ్బకన గోటికొన జీర మరుగుబడ
    పెనుకెంపు బన్నసరు లనువుబరచి
    తనకింద ఁదళుకు కన్నుల నిదుర సొలయగా
    వనజము మూర్కొని వూర్పుబడి నణచుకొంటా

    చ: అల తత్తరబడుచు అవ్వల నివ్వల గట్టు
    చలువశాలకలువలు సడలగా
    అల శ్రీవేంకటరాయని కూడిన సరసపు
    కలయిక మది తలచుకొంటా


    ade vachche cheliya yoyArammutO
    sampuTi: 26, samkhya: 1, puTa: 5 (13)
    sampuTilO rAgam: (tALapatramlO pErulEdu)
    rachana: tALlapAka annamAchArya


    pa: ade vachche cheliya yoyArammutO priyuni
    sadanambu veDali tana sakhulu ganakumDA

    cha: nuduTi kasturi chemaTa padanai jAruchIra
    nadimi vIDina turumu kuduruparachi
    vodigodigi tanakevvareduraudurO yamTA
    pedavigamTI maDupu tuda mATukomTA

    cha: nunugubbakana gOTikona jIra marugubaDa
    penukempu bannasaru lanuvubarachi
    tanakimda daLuku kannula nidura solayagA
    vanajamu mUrkoni vUrpubaDi naNachukomTA

    cha: ala tattarabaDuchu avvala nivvala gaTTu
    chaluvaSAlakaluvalu saDalagA
    ala SrIvEmkaTarAyani kUDina sarasapu
    kalayika madi talachukomTA



    Artist(s): Shobha Raju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported