Banner


    దేవశిఖామణివి దిష్టదైవమవు
    సంపుటి: 3, సంఖ్య: 418, పుట: 281 (321)
    సంపుటిలో రాగం: బౌళి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
    యీవల నీబంట నాకు నెదురింక నేది

    చ: కామధేనువుఁ బిదుకఁగలకోరికె లివెల్ల
    కామధేనువులు పెక్కు గాచేకృష్ణుఁడవట
    కామించి నీ బంటనట కమ్మి నిన్నుఁ దలఁచితి-
    నేమి మాకుఁ గడమయ్య యిందిరారమణా

    చ: యెంచఁ గల్పవృక్షమును యిచ్చు సిరులెల్లాను
    నించి కల్పవృక్షములనీడల కృష్ణుఁడవట
    అంచెల నీబంటనట ఆత్మలో నిన్ను నమ్మితి
    వంచించఁ గడమ యేది వసుధాధీశ

    చ: తగ నొక్కచింతామణి తలఁచినట్లఁ జేసు
    మిగులఁ కౌస్తుభమణిమించినకృష్ణుఁడవట
    పగటు శ్రీవేంకటేశ భక్తుఁడ నీకట నేను
    జగములోఁ గొఱతేది జగదేకవిభుఁడా


    dEvaSikhAmaNivi diShTadaivamavu
    sampuTi: 3, samkhya: 418, puTa: 281 (321)
    sampuTilO rAgam: bauLi
    rachana: tALlapAka annamAchArya


    pa: dEvaSikhAmaNivi diShTadaivamavu nIvu
    yIvala nIbamTa nAku nedurimka nEdi

    cha: kAmadhEnuvu bidukagalakOrike livella
    kAmadhEnuvulu pekku gAchEkRShNuDavaTa
    kAmimchi nI bamTanaTa kammi ninnu dalachiti-
    nEmi mAku gaDamayya yimdirAramaNA

    cha: yemcha galpavRkShamunu yicchu sirulellAnu
    nimchi kalpavRkShamulanIDala kRShNuDavaTa
    amchela nIbamTanaTa AtmalO ninnu nammiti
    vamchimcha gaDama yEdi vasudhAdhISa

    cha: taga nokkachimtAmaNi talachinaTla jEsu
    migula kaustubhamaNimimchinakRShNuDavaTa
    pagaTu SrIvEmkaTESa bhaktuDa nIkaTa nEnu
    jagamulO go~ratEdi jagadEkavibhuDA



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported