Banner


    అది నే నెఱఁగనా అంతలో
    సంపుటి: 2, సంఖ్య: 185, పుట: 124 (196)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అది నే నెఱఁగనా అంతలో భ్రమతుఁగాక
    మదనజనక నాకు మంచిబుద్ధి యియ్యవే

    చ: యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి
    కొంతైనా బ్రహ్మచింత కోటిలాభము
    వింతైనజనులతోడొవినోదము నిష్పలము
    చెంత సజ్జనసంగతి చేరినయాదాయము

    చ: నానాదేశవార్తలు నడుమఁ జింతామూలము
    పూనినపురాణగోష్టి పుణ్యమూలము
    ఆనినకృషివాణిజ్యాలన్నియుఁ దీరనివెట్టి
    మాననియాచార మాత్మకుఁ బడ్డపాటు

    చ: పలుచుట్టరికములు బట్టబయలుతగుళ్లు
    చెలఁగునాచార్యసేవ జీవన్ముక్తి
    బలిమి శ్రీవేంకటేశ పరగ రెండువిధాలు
    నిలుకడయినవాఁడవు నీవే యిన్నిటికి


    adi nE ne~raganA amtalO
    sampuTi: 2, samkhya: 185, puTa: 124 (196)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: adi nE ne~raganA amtalO bhramatugAka
    madanajanaka nAku mamchibuddhi yiyyavE

    cha: yemta lOkAnubhavamu amtayu vrithA naShTi
    komtainA brahmachimta kOTilAbhamu
    vimtainajanulatODovinOdamu niShpalamu
    chemta sajjanasamgati chErinayAdAyamu

    cha: nAnAdESavArtalu naDuma jimtAmUlamu
    pUninapurANagOShTi puNyamUlamu
    AninakRShivANijyAlanniyu dIraniveTTi
    mAnaniyAchAra mAtmaku baDDapATu

    cha: paluchuTTarikamulu baTTabayalutaguLlu
    chelagunAchAryasEva jIvanmukti
    balimi SrIvEmkaTESa paraga remDuvidhAlu
    nilukaDayinavADavu nIvE yinniTiki



    Artist(s): M Bala Murali Krishna



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported