Banner


    ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాదవరదుఁడు
    సంపుటి: 4, సంఖ్య: 524, పుట: 354 (366)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాదవరదుఁడు
    యేదెసఁ జూచినాఁ దానె యీతఁడిదె(?) దేవుడు

    చ: నవ్వులమోముతోడ నరసింహరూపుతోడ
    జవ్వనితొడమీఁదట సరసమాడ
    పువ్వులదండలు యిరుబుజాలపై వేసుకొని
    వువ్విళ్ళూరఁ గొలువై వున్నాఁడు దేవుఁడు

    చ: సంకుఁ జక్రములతోడ జమళికోరలతోడ
    అంకెలఁ గటియభయహస్తా లెత్తి
    కంకణాలహారాలతో ఘనకిరీటము వెట్టి
    పొంకమైన ప్రతాపానఁ బొదలీ నీ దేవుఁడు

    చ: నానాదేవతలతోడ నారదాదులతోడ
    గానములు వినుకొంటా గద్దెపై నుండి
    ఆనుక శ్రీవేంకటాద్రి నహోబలమునందు
    తానకమై వరాలిచ్చీ దాసులకు దేవుఁడు


    AdimUrti yItaDu prahlAdavaraduDu
    sampuTi: 4, samkhya: 524, puTa: 354 (366)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: AdimUrti yItaDu prahlAdavaraduDu
    yEdesa jUchinA dAne yItaDide(?) dEvuDu

    cha: navvulamOmutODa narasim^harUputODa
    javvanitoDamIdaTa sarasamADa
    puvvuladamDalu yirubujAlapai vEsukoni
    vuvviLLUra goluvai vunnADu dEvuDu

    cha: samku jakramulatODa jamaLikOralatODa
    amkela gaTiyabhayahastA letti
    kamkaNAlahArAlatO ghanakirITamu veTTi
    pomkamaina pratApAna bodalI nI dEvuDu

    cha: nAnAdEvatalatODa nAradAdulatODa
    gAnamulu vinukomTA gaddepai numDi
    Anuka SrIvEmkaTAdri nahObalamunamdu
    tAnakamai varAlichchI dAsulaku dEvuDu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported