Banner


    ఆదిమునులసిద్ధాంజనము
    సంపుటి: 1, సంఖ్య: 261, పుట: 175 (241)
    సంపుటిలో రాగం: ధన్నాసి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆదిమునులసిద్ధాంజనము
    యేదెసఁ జూచిన నిదివో వీఁడే

    చ: నగినసెలవిఁ బడు నాలుగుజగముల
    మొగమునఁ జూపే మోహనము
    నిగిడి యశోదకు నిధానంబై
    పొగడొందీ గృహమున నిదె వీఁడే

    చ: కనుదెరచిన నలుగడ నమృతము లటు
    అనువునఁ గురిసీ నపారము
    వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ
    మనికికి నిరవై మలసీ వీఁడే

    చ: పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-
    పరిపూర్ణ పరాత్పరుఁడు
    సరుస రుక్మిణికి సత్యభామకును
    వరుఁడగువేంకటవరదుఁడు వీఁడే


    AdimunulasiddhAmjanamu
    sampuTi: 1, samkhya: 261, puTa: 175 (241)
    sampuTilO rAgam: dhannAsi
    rachana: tALlapAka annamAchArya


    pa: AdimunulasiddhAmjanamu
    yEdesa jUchina nidivO vIDE

    cha: naginaselavi baDu nAlugujagamula
    mogamuna jUpE mOhanamu
    nigiDi yaSOdaku nidhAnambai
    pogaDomdI gRhamuna nide vIDE

    cha: kanuderachina nalugaDa namRtamu laTu
    anuvuna gurisI napAramu
    vanitalu namdavrajamuna jelagaga
    manikiki niravai malasI vIDE

    cha: paramunakunu dA baramai velasina-
    paripUrNa parAtparuDu
    sarusa rukmiNiki satyabhAmakunu
    varuDaguvEmkaTavaraduDu vIDE



    Artist(s): Priya Sisters



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported