Banner


    చిన్ని శిశువూ చిన్ని శిశువూ
    సంపుటి: 6, సంఖ్య: 1, పుట: 1 (17)
    సంపుటిలో రాగం: ఆహిరి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : చిన్ని శిశువూ చిన్ని శిశువూ
    యెన్నఁడుం జూడ మమ్మ యిటువంటి శిశువూ

    చ : తోయంపుగురులతోడఁ దూగేటి శిరసు, చింత
    కాయలవంటి జడలగములతోడ
    మ్రోయుచున్న కనకంపు మువ్వల పాదాలతోడ
    పాయక యశోదవెంటఁ బాఱాడు శిశువూ

    చ : ముద్దుల వ్రేళ్లతోడ మొరవంక యుంగరాల
    నిద్దపుంజేతుల పైఁడి బొద్దులతోడ
    అద్దపుంజెక్కులతోడ నప్ప లప్ప లనినంత
    గద్దించి యశోదమేనుఁ కౌఁగిలించు శిశువూ

    చ : బలుపైన పొట్టమీఁది పాలచాఱలతోడ
    నులివేఁడి వెన్న దిన్న నోరితోడ
    చెలఁగి నేఁ డిదె వచ్చి శ్రీవేంకటాద్రిపై
    నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ


    chinni SiSuvU chinni SiSuvU
    sampuTi: 6, samkhya: 1, puTa: 1 (17)
    sampuTilO rAgam: Ahiri
    rachana: tALlapAka annamAchArya


    pa : chinni SiSuvU chinni SiSuvU
    yennaDuM jUDa mamma yiTuvamTi SiSuvU

    cha : tOyaMpugurulatODa dUgETi Sirasu, chimta
    kAyalavaMTi jaDalagamulatODa
    mrOyuchunna kanakampu muvvala pAdAlatODa
    pAyaka yaSOdavemTa bA~rADu SiSuvU

    cha : muddula vrELlatODa moravamka yumgarAla
    niddapumjEtula paiDi boddulatODa
    addapumjekkulatODa nappa lappa laninamta
    gaddimchi yaSOdamEnu kaugilimchu SiSuvU

    cha : balupaina poTTamIdi pAlachA~ralatODa
    nulivEDi venna dinna nOritODa
    chelagi nE Dide vacchi SrIvEMkaTAdripai
    nilichi lOkamulella nilipina SiSuvU



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported