Banner


    ఆదిమూలమే మాకు నంగరక్ష
    సంపుటి: 4, సంఖ్య: 49, పుట: 33 (45)
    సంపుటిలో రాగం: ముఖారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : ఆదిమూలమే మాకు నంగరక్ష
    శ్రీదేవుఁడే మాకు జీవరక్ష

    చ: భూమిదేవిపతియైన పురుషోత్తముఁడె మాకు
    భూమిపై నేడ నుండినా భూమిరక్ష
    ఆమనిజలధిశాయి అయిన దేవుఁడే మాకు
    సామీప్యమందున్న జలరక్ష

    చ : మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుఁడే
    ఆయములు దాఁకకుండా నగ్నిరక్ష
    వాయుసుతు నేలినట్టి వనజనాభుఁడే మాకు
    వాయువందుఁ గందకుండా వాయురక్ష

    చ : పాదమాకసమునకుఁ బారఁజాఁచే విష్ణువే
    గాదిలియై మాకు నాకాశరక్ష
    సాదించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుఁడే మాకు
    సాదరము మీరినట్టి సర్వరక్ష


    AdimUlamE mAku namgarakSha
    sampuTi: 4, samkhya: 49, puTa: 33 (45)
    sampuTilO rAgam: mukhAri
    rachana: tALlapAka annamAchArya


    pa : AdimUlamE mAku namgarakSha
    SrIdEvuDE mAku jIvarakSha

    cha: bhUmidEvipatiyaina puruShOttamuDe mAku
    bhUmipai nEDa nuMDinA bhUmirakSha
    AmanijaladhiSAyi ayina dEvuDE mAku
    sAmIpyamamdunna jalarakSha

    cha : mrOyuchu nagnilO yaj~namUrtiyaina dEvuDE
    Ayamulu dAkakumDA nagnirakSha
    vAyusutu nElinaTTi vanajanAbhuDE mAku
    vAyuvamdu gamdakumDA vAyurakSha

    cha : pAdamAkasamunaku bArajAchE viShNuvE
    gAdiliyai mAku nAkASarakSha
    sAdimchi SrIvEMkaTAdri sarvESwaruDE mAku
    sAdaramu mIrinaTTi sarwarakSha



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported