Banner


    ఆదిమపూరుషుఁ డచ్యుతుఁ
    సంపుటి: 1, సంఖ్య: 80, పుట: 55 (121)
    సంపుటిలో రాగం: శంకరాభరణం*
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆదిమపూరుషుఁ డచ్యుతుఁ డచలుఁ డనంతుం డమలుఁడు
    ఆదిదేవుఁ డీతఁడేపో హరి వేంకటవిభుఁడు

    చ: ఏకార్ణవమై ఉదకములేచినబ్రహ్మాండములోఁ
    బైకొనియుండఁగ నొకవటపత్రములోపలను
    చేకొని పవళింపుచు నొకశిశువై వడిఁ దేలాడిన-
    శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు

    చ: అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటినరూపము
    సరుగన భూమింతయు నొకచరణంబున గొలచి
    పరగినపాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన
    పరమాత్ముఁ డీతఁడేపో పతివేంకటవిభుఁడు

    చ: క్షీరపయోనిధిలోపల శేషుఁడు పర్యంకముగా
    ధారుణియును సరియునుఁ బాదము లొత్తఁగను
    చేరువఁ దను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడి
    నారాయణుఁ డీతఁడే వున్నత వేంకటవిభుఁడు

    * పెద్దరేకులో రాగం - సామంతం


    AdimapUruShu Dachyutu
    sampuTi: 1, samkhya: 80, puTa: 55 (121)
    sampuTilO rAgam: SamkarAbharaNam*
    rachana: tALlapAka annamAchArya


    pa: AdimapUruShu Dachyutu Dachalu Danamtum DamaluDu
    AdidEvu DItaDEpO hari vEmkaTavibhuDu

    cha: EkArNavamai udakamulEchinabrahmAmDamulO
    baikoniyumDaga nokavaTapatramulOpalanu
    chEkoni pavaLimpuchu nokaSiSuvai vaDi dElADina-
    SrIkAmtu DItaDEpO SrIvEmkaTavibhuDu

    cha: aruduga balimada maDapaga nAkasamamTinarUpamu
    sarugana bhUmimtayu nokacharaNambuna golachi
    paraginapAdAmguTamuna brahmAmDamu nagilimchina
    paramAtmu DItaDEpO pativEmkaTavibhuDu

    cha: kShIrapayOnidhilOpala SEShuDu paryamkamugA
    dhAruNiyunu sariyunu bAdamu lottaganu
    chEruva danu brahmAdulu sEvimpaga jeluvomdeDi
    nArAyaNu DItaDE vunnata vEmkaTavibhuDu

    *peddarEkulO rAgam - sAmamtam



    Artist(s): Priya Sisters



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported