Banner


    ఆచారవిచారా లవియు నే నెరఁగ
    సంపుటి: 4, సంఖ్య: 395, పుట: 265 (277)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆచారవిచారా లవియు నే నెరఁగ
    వాచామగోచరపువరదుఁడ (వు) నీవు

    చ: తపమొక్కటే నాకుఁ దగునీశరణనుట
    జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట
    వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట
    విపరీతవిజ్ఞానవిధులేమి నెరఁగ

    చ: కర్మమొక్కటే నీ కైంకర్యగతి నాకు
    ధర్మమొక్కటే నీ దాసానుదాస్యము
    మర్మమొక్కటే నామతి నిన్నుఁ దలఁచుట
    అర్మిలి నింతకంటే నవల నే నెరఁగ

    చ: బలిమియొక్కటే నాకు భక్తి నీపైఁ గలుగుట
    కలిమియొక్కటే నీవు గలవని నమ్ముట
    యెలమితో శ్రీవేంకటేశ నీవు గతిదక్క
    పలుబుద్ధుల నేఁబొరలు భావనలేనెరఁగ


    AchAravichArA laviyu nE neraga
    sampuTi: 4, samkhya: 395, puTa: 265 (277)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: AchAravichArA laviyu nE neraga
    vAchAmagOcharapuvaraduDa (vu) nIvu

    cha: tapamokkaTE nAku dagunISaraNanuTa
    japamokkaTE ninnu sAreku nutimchuTa
    vupamokkaTE nIve vunnatuDavamTa
    viparItavij~nAnavidhulEmi neraga

    cha: karmamokkaTE nI kaimkaryagati nAku
    dharmamokkaTE nI dAsAnudAsyamu
    marmamokkaTE nAmati ninnu dalachuTa
    armili nimtakamTE navala nE neraga

    cha: balimiyokkaTE nAku bhakti nIpai galuguTa
    kalimiyokkaTE nIvu galavani nammuTa
    yelamitO SrIvEmkaTESa nIvu gatidakka
    palubuddhula nEboralu bhAvanalEneraga



    Artist(s): P Ranganath



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported