Banner


    అదుగో కొలువై యున్నాడు
    సంపుటి: 27, సంఖ్య: N/A, పుట: xxiv (24)
    సంపుటిలో రాగం: దేశాక్షి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదుగో కొలువై యున్నాడు - అలమేలుమంగపతి
    పదివేల విధములను పారుపత్తెము జేయుచు

    చ: రంగమండపములో - రత్నసింహాసనముపై
    అంగనామణులతో - అమర వేంచేసి
    బంగారు పావడలు - పసరించి యిరుగడల
    శృంగారముగ సురలు - సేవ శేయగను

    చ: వెండిబైడి గుదియలను - వేత్రహస్తులు పొగడ
    నిండు వెన్నెలపూల - దండ లమర
    హుండిగను కానుకల - నొనర లక్కలు జేయ
    దండి మీఱగ నిపుడు - దేవరాయడు చెలగి

    చ: అంగరంగ వైభవముల - రంగుగా చేకొనుచు
    మంగళహారతుల - మహిమవెలసి
    శృంగారమైనట్టి మా శ్రీవేంకటాధిపు
    డంగనలు కొలువగా నిపుడు వేంచేసి


    adugO koluvai yunnADu
    sampuTi: 27, samkhya: N/A, puTa: xxiv (24)
    sampuTilO rAgam: dESAkShi
    rachana: tALlapAka annamAchArya


    pa: adugO koluvai yunnADu - alamElumamgapati
    padivEla vidhamulanu pArupattemu jEyuchu

    cha: ramgamamDapamulO - ratnasim^hAsanamupai
    amganAmaNulatO - amara vEmchEsi
    bamgAru pAvaDalu - pasarimchi yirugaDala
    SRmgAramuga suralu - sEva SEyaganu

    cha: vemDibaiDi gudiyalanu - vEtrahastulu pogaDa
    nimDu vennelapUla - damDa lamara
    humDiganu kAnukala - nonara lakkalu jEya
    damDi mI~raga nipuDu - dEvarAyaDu chelagi

    cha: amgaramga vaibhavamula - ramgugA chEkonuchu
    mamgaLahAratula - mahimavelasi
    SRmgAramainaTTi mA SrIvEmkaTAdhipu
    Damganalu koluvagA nipuDu vEmchEsi



    Artist(s): P Ranganath



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported