Banner


    ఆదిదైవుఁడై అందరిపాలిటి
    సంపుటి: 1, సంఖ్య: 127, పుట: 87 (153)
    సంపుటిలో రాగం: సామంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆదిదైవుఁడై అందరిపాలిటి-
    కీ దేవుఁడై వచ్చె నితఁడు

    చ: కోరినపరమయోగులచిత్తములలోన
    యేరీతినుండెనో యీతఁడు
    చేరవచ్చినయాశ్రితులనెల్లఁ బ్రోవ
    యీరీతి నున్నవాఁ డీతఁడు

    చ: కుటిలదానవుల కోటానఁగోట్ల
    యెటువలెఁ ద్రుంచెనో యీతఁడు
    ఘటియించి యిటువంటికారుణ్యరూపుఁడై
    యిటువలె నున్నవాఁ డీతఁడు

    చ: తక్కక బ్రహ్మాండతతులెల్ల మోచి తా-
    నెక్కడ నుండెనో యీతఁడు
    దిక్కుల వెలసినతిరువేంకటేశుఁడై
    యిక్కడ నున్నవాఁ డీతఁడు


    AdidaivuDai amdaripAliTi
    sampuTi: 1, samkhya: 127, puTa: 87 (153)
    sampuTilO rAgam: sAmamtam
    rachana: tALlapAka annamAchArya


    pa: AdidaivuDai amdaripAliTi-
    kI dEvuDai vacce nitaDu

    cha: kOrinaparamayOgulachittamulalOna
    yErItinumDenO yItaDu
    chEravaccinayASritulanella brOva
    yIrIti nunnavA DItaDu

    cha: kuTiladAnavula kOTAnagOTla
    yeTuvale drumchenO yItaDu
    ghaTiyimchi yiTuvamTikAruNyarUpuDai
    yiTuvale nunnavA DItaDu

    cha: takkaka brahmAMDatatulella mOchi tA-
    nekkaDa numDenO yItaDu
    dikkula velasinatiruvEmkaTESuDai
    yikkaDa nunnavA DItaDu



    Artist(s): N C Sridevi



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported