Banner


    చదివి బతుకరో సర్వజనులు
    సంపుటి: 4, సంఖ్య: 33, పుట: 22 (34)
    సంపుటిలో రాగం: దేసాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: చదివి బతుకరో సర్వజనులు మీరు
    కదిసి నారాయణాష్టాక్షర మిదియే

    చ: సాదించి మున్ను శుకుఁడు చదివినట్టిచదువు
    వేదవ్యాసులు చదివినచదువు
    ఆదికాలపువైష్ణవులందరినోటిచదువు
    గాదిలినారాయణాష్టాక్షర మిదియే

    చ: సతతము మునులెల్ల చదివినట్టిచదువు
    వెతదీర బ్రహ్మ చదివినచదువు
    జతనమై ప్రహ్లాదుఁడు చదివినట్టిచదువు
    గతిగా నారాయణాష్టాక్షర మిదియే

    చ: చలపట్టి దేవతలు చదివినట్టిచదువు
    వెలయ విప్రులు చదివేటిచదువు
    పలుమారు శ్రీవేంకటపతినామమై భువిఁ
    గలుగు నారాయణాష్టాక్షర మిదియే


    chadivi batukarO sarvajanulu
    sampuTi: 4, samkhya: 33, puTa: 22 (34)
    sampuTilO rAgam: dEsALam
    rachana: tALlapAka annamAchArya


    pa: chadivi batukarO sarvajanulu mIru
    kadisi nArAyaNAshTAkshara midiyE

    cha: sAdimchi munnu SukuDu chadivinaTTichaduvu
    vEdavyAsulu chadivinachaduvu
    AdikAlapuvaishNavulamdarinOTichaduvu
    gAdilinArAyaNAshTAkshara midiyE

    cha: satatamu munulella chadivinaTTichaduvu
    vetadIra brahma chadivinachaduvu
    jatanamai prahlAduDu chadivinaTTichaduvu
    gatigA nArAyaNAshTAkshara midiyE

    cha: chalapaTTi dEvatalu chadivinaTTichaduvu
    velaya viprulu chadivETichaduvu
    palumAru SrIvEmkaTapatinAmamai bhuvi
    galugu nArAyaNAshTAkshara midiyE



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported